ఏదైనా ఒక ఆకు లేదా వేరును దానితోపాటు కలిపి ఇచ్చే అనుపానాన్ని బట్టి దాని ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. ఇది ఆయుర్వేదంలోని ఒక విశేషం. ఉదాహరణకు సునాముఖి ఆకు (నేల తంగేడు ఆకు)నే తీసుకుంటే, దానితో కలిపి తీసుకునే అనుపానాన్ని బట్టి దాని ఫలితాలు మారిపోతుంటాయి. ఆ విశేషాల్లో కొన్ని…..చిటికెడు సునాముఖి ఆకు పొడిని తేనెతో తీసుకుంటే దాతుపుష్టి కలుగుతుంది.పంచదారతో పుచ్చుకుంటే వాతం హరిస్తుంది. బెల్లంతో పుచ్చుకుంటే జీవక్రియలు ఉత్తేజితమై ఆరోగ్యం చక్కబడుతుంది.పాత బెల్లంతో సేవిస్తే జలుబు నుంచి ఉపవమనం లభిస్తుంది.మేకపాలతో తీసుకుంటే శరీరం బలాన్ని పుంజుకుంటుంది. ఆవు పాలతో సేవిస్తే, శరీరం కాంతిమంతం అవుతుంది.,ఖర్జూరంతో సేవిస్తే, పేగుల్లోంచి వచ్చే దుర్వాసన దూరమవుతుంది.నీళ్లతో తీసుకుటే గుండె నొప్పి నివారణ సాధ్యమవుతుంది.గుంట కలగరాకుతో తీసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.ద్రాక్ష పండ్లతో సేవిస్తే, కంటి చూపు మెరుగవుతుంది.ఉసిరి కాయ రసంతో సేవిస్తే రక్తశుద్ది జరిగి ఆరోగ్యం చక్కబడుతుంది.నిమ్మరసంతో తీసుకుంటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి.
తంగేడు ఆకు-ఖర్జూరం కలిపి తీసుకుంటే…
Related tags :