అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పెద్దవయస్కుడిగా జో బైడెన్ రికార్డు సృష్టించబోతున్నారు. గత నవంబరులో బైడెన్‌కు 78 సంవత్సరాలు నిండాయి. బైడెన్ కంటే ముందు… ప్రమాణ స్వీకారం సమయానికి అత్యంత ఎక్కువ వయస్సున అధ్యక్షుడు ట్రంపే! నాలుగేళ్ళ కిందట 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసేనాటికి ట్రంప్ వయసు 70 సంవత్సరాలు. ఆయనకంటే ముందు… 69 సంవత్సరాల వయసులో రొనాల్డ్ రీగన్ ప్రమాణం చేశారు. మరి అత్యంత పిన్నవయసులో అధ్యక్షుడైన వారెవరు? చాలామంది 43 సంవత్సరాల జాన్ ఎఫ్ కెనడీ పేరు చెబుతారు. కానీ రూజ్వెల్ట్ 42 ఏళ్ళ వయసులోనే (1901) అధ్యక్షుడయ్యారు. యులిసెస్ గ్రాంట్ (46), బిల్ క్లింటన్ (46), ఒబామా (47) ఏళ్ళ వయసులో అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
78ఏళ్ల వయస్సులో రికార్డులు బద్ధలుకొట్టి…
Related tags :