జనవరి17నుండిఎప్రియల్_30వరకు.. శుక్రగురుమౌడ్యమి..
ఏకార్యాలుచెయ్యాలి?
ఏకార్యాలుచేయరాదు…?
అసలుమౌఢ్యమిఅంటే_ఏమిటి..?
గురు గ్రహమే కాని, శుక్ర గ్రహమే కాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
శుభ గ్రహమైన శుక్రునకు
మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము..
మౌఢ్యమిని_మూఢమి”గా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నా గురు, శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.
శుక్ర మౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి – శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
మౌఢ్యమిలోచేయకూడనికార్యక్రమములు:
పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, గృహ శంకుస్థాపన, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనము కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టు వెంట్రుకలకు, వేద”విధ్యా”ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు, నూతన వాహనాలు కొనుట మొదలగునవి చేయరాదు.
మౌఢ్యమిలోచేయదగినపనులు:
జాతకర్మ.. జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్పాతాది దోషములకు శాంతులు, రుద్రాభిషేకం, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు నియత కాలంలో వచ్చును గనుక గురు మౌఢ్యమి వచ్చినా, శుక్ర మౌఢ్యమి వచ్చినా చేయవచ్చును.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిధులలో, అశ్వని, రేవతి నక్షత్రాలలో, శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్ర దోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు…