DailyDose

పోలీసులపై సోము వీర్రాజు ఆగ్రహం-నేరవార్తలు

పోలీసులపై సోము వీర్రాజు ఆగ్రహం-నేరవార్తలు

* పోలీసులపై భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహంభాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయం వద్ద ధర్నాకు భాజపా పిలుపునివ్వటంతో సోమువీర్రాజు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అడ్డుకున్నారు.తాను ఏం తప్పు చేశానని ఇంటికి పోలీసులు వచ్చారని సోము నిలదీశారు.అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు తలుపులు కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.’అపార్ట్​మెంట్​లో నేను అద్దెకు ఉంటున్నా. ఇంతమంది పోలీసులు వస్తే చుట్టు పక్కల వారంతా ఏమనుకుంటారు?. నేను ఇక్కడ ఉండాలా…ఇల్లు ఖాళీ‌ చేయాలా?.నేను డీజీపీ కార్యాలయం ముట్టడిస్తానని చెప్పలేదు కదా. నా ముందు పోలీసులు ఎవరూ ఉండకూడదు. మీ ప్రవర్తనా, వైఖరిని ఖండిస్తున్నా’ అని ధ్వజమెత్తారు సోమువీర్రాజు.

* బెజవాడ దుర్గమ్మ రథం వెండి సింహాల మాయం కేసులో పోలీసులు పురోగతి.ఈ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు.వెండి విగ్రహాలను తుని జ్యూయలరీ షాపులో విక్రయించినట్లు సమాచారం.16 కిలోల బరువున్న మూడు వెండి విగ్రహాలను షాపు యజమాని కరిగించినట్లు విచారణలో తేలింది.షాపు యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపాయి.ఆలయంలో పనిచేసే సిబ్బందితో పాటు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని, ఈతరహా చోరీలు చేసే పాత నేరస్థులు 40 మందిని విచారించారు.

* కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు. ఈ తనిఖీల లో గరుడ బస్సు లో తరలిస్తన్న 50 లక్షల రూపాయల నగదు ను గుర్తించి న పోలీసులు.వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న వ్యక్తి వద్ద నుండి స్వాధీనం.ఎలాంటి పత్రాలు లేకుండా 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళున్న వ్యక్తి.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడి కేసులో అరెస్టయిన ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విచారణ కొనసాగుతోంది.సీఐడీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు.

* గుంటూరు జిల్లా తెనాలిలో హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరరావుపై దాడి జరిగింది.సుల్తానాబాద్‌లో మద్యం మత్తులో వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు.హోటల్ సిబ్బంది సమాచారంతో సంఘటన ప్రదేశానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్‌ను వెంకటేష్ బైక్‌పై నుంచి కింద పడేసి దాడి చేశాడు.హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరావు తలకు తీవ్ర గాయం అయింది.దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరాలు అందవలసి ఉంది.

* పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ లో సంభవించిన అగ్ని ప్రమాదంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది.

* గుంటూరులో జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద టీఎస్ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

* ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ ఆత్మాహుతి దాడులలో దద్దరిల్లింది.గురువారం చోటు చేసుకున్న వరుస సూసైడ్‌ ఎటాక్స్‌లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయాల పాలయ్యారు.