* దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త మైలురాయిని అందుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ద్విచక్రవాహన తయారీలో నిమగ్నమై ఉన్న ఈ సంస్థ ఇప్పటి వరకు 10 కోట్ల వాహనాలను తయారు చేసి రికార్డు సృష్టించింది. హరిద్వార్‌లోని ప్లాంట్‌లో తన ఎక్స్ట్రీమ్ 160ఆర్ మోడల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఉత్సాహంతో ఏటా 10 కొత్త ఉత్పత్తులను రానున్న ఐదేళ్లలో తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
* బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చి పైపైకి పోతున్నాయ్. వరుసగా నాలుగో రోజూ వీటి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఒక్కరోజే బంగారం ధర (24 క్యారెట్ల) రూ.575లు.. వెండి ధర రూ.1227లు పెరగడం గమనార్హం. తాజా పెరుగుదలతో దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.49,125కు చేరగా.. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,699లు పలికింది. ప్రపంచ మార్కెట్లో చోటుచేసుకున్న ట్రెండ్స్ ఆధారంగానే ఈ పెరుగుల నమోదైనట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.
* కొనుగోళ్ల అండతో కొత్త గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్‌మార్కెట్లు.. ఆ రికార్డులను నిలబెట్టుకోలేకపోయాయి. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాలను చవిచూశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 50వేల దిగువకు పడిపోగా.. నిఫ్టీ 14,600 మార్క్‌ను కోల్పోయింది.
* ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని మరొకరికి విక్రయించినప్పుడు బీమా పాలసీ బదిలీ జరుగుతుంది. వాహనాన్ని విక్రయించినప్పుడు, దానికి సంబంధించిన పాలసీని కూడా కొత్త యజమాని పేరుపై బదిలీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాహనాన్ని అమ్మిన తరువాత రోడ్డు ప్రమాదం జరిగితే బీమా సంస్థ దావాను తిరస్కరించవచ్చు.
* బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్.. నేడు చరిత్ర సృష్టించింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 50,000 మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో అంతర్జాతీయ మార్కెట్లు ‘జో’ష్ లో ఉండటం, దేశంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో దలాల్ స్ట్రీట్ కొనుగోళ్లతో కళకళలాడుతోంది. ఫలితంగా సెన్సెక్స్ కొత్త రికార్డుల్లో దూసుకెళ్తోంది.
* బ్యాంకులు వివిధ మీడియా ఛానళ్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నప్పటికీ బ్యాంకింగ్ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి మోసాలను గురించి ఖాతాదారులు తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఖాతాదారుడు శ్రద్ధగా, అవగాహనతో వ్యవహరిస్తే బ్యాంకింగ్ మోసాలను చాలా వరకు నివారించవచ్చని బ్యాంకింగ్ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన మోసాల గురించి అవగాహన కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు మూడు చిట్కాలతో కూడిన మెయిల్‌ను పంపించింది. మోసాలకు పాల్పడే వారు ఖాతాదారుల మొబైల్ ఫోన్లకు ఏవిధంగా మోసపూరిత సందేశాలను బ్యాంక్ పేరుతో పంపుతారో ఇందులో సవివరంగా తెలియజేసింది.
* మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు మీ జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లో తప్పనిసరిగా ప్రతినెల జమచేస్తారు. కానీ, మీ పదవీ విరమణ అవసరాలను తీర్చడానికి ఈపిఎఫ్ మాత్రమే సరిపోతుందని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు అని నిపుణులు చెప్తున్నారు. పన్ను సామర్థ్యాన్ని బట్టి, ఈపీఎఫ్ కచ్చితంగా మంచి పెట్టుబడి పథకం. ఇందులో మూడు దశల్లో పన్నుపై పూర్తి మినహాయింపు లభిస్తుంది. అంటే పెట్టుబడి, దానిపై లభించే వడ్డీతో పాటు ఉపసంహరణ సమయంలో కూడా ఎటువంటి పన్ను వర్తించదు. రాబడికి ప్రభుత్వం హామీ ఇస్తుంది, కాబట్టి, మూలధన భద్రత గురించి ఎటువంటి సమస్య లేదు.