Movies

సరిగమపదనిస అంటే ఏమిటి?

సరిగమపదనిస అంటే ఏమిటి?

స అంటే, రి అంటే,గ అంటే,మ అంటే, ప అంటే, ద అంటే,ని అంటే ఏమిటో.
………………………………………………

గానం, వాద్యం, నృత్యాల కలయికే సంగీతకళ. గానం, నృత్యం వేరువేరుగా ప్రదర్శిస్తే అది సంగీతమే అవుతుంది.

శబ్దానికి శక్తిని కలిగించి సుస్వరంగా ఆలాపన చేయడమే గానం.
గానానికి రోగాలను నయంచేసే గుణముంది. అది మనసును రంజిం పచేస్తుంది. రాళ్ళను కరిగిస్తుంది. వానలను కురిపిస్తుంది. మనుషులనే కాదు వృక్షాలు పశువులు కూడా సంగీతసాగరంలో ఓలలాడుతాయి.

ఇలాంటి సంగీతాన్ని ప్రాచీన హైందవులు ఒకశాస్త్రంగా రూపొందించారు. వేదాలలో సామవేదం సంగీతాన్ని గురించి వివరిస్తుంది.

మనగానకళకు సప్తస్వరాలే ప్రామాణికం. సరిగమపదని లే సప్తస్వరాలకు పునాది. ఈ సరిగమలను షడ్జమాలు అంటారు.

ఈ సరిమగలనే షడ్జమాలను ఎక్కడనుండి తీసుకొన్నారో చూద్దాం.

(1) స = షడ్జమం. నెమలికూత నుండి తీసుకోవడం జరిగింది.

(2) రి = రిషభం. వృషభద్వని నుండి ( ఎద్దురంకె)

(3) గ = గాంధారం. మేక అరుపునుండి,

(4) మ = మధ్యమము. క్రౌంచపక్షి కూతనుండి,

(5) ప = పంచమం. వసంతకాలంలో కూసేకోకిల స్వరంనుండి,

(6) ద = దైవతం.,గుర్రపు సకిలింపునుండి,

(7) ని = నిషాదము. ఏనుగు ఘీంకారమునుండి తీసుకోవడమైనది.

రాగం తాళం పల్లవి ఈ మూడు సమపాళ్ళలో వుంటే అది గొప్ప సంగీతమైతుంది. సప్తస్వరాల ఆరోహణ అవరోహణలే రాగం.
నవరసాలను పలికించటానికి వేరువేరుగా రాగాలుంటాయి. వీరరసమైతే సారంగరాగం, కరుణరసానికి ముఖారిరాగం, శృంగారానికి కమాన్ రాగము పయోగిస్తారు.

సంగీతానికి కొలబద్ద తాళం.సంగీతం యొక్క లయను తెలుపుతుంది. సాధారణంగా తాళములు ఏడురకాలు అవి (1) దృవ (2) మధ్య (3) రూపక (4) జంపె (5) త్రిపుట (6) ఆట (7) ఏకతాళం.

పల్లవికి ప్రాణం మంచిసాహిత్యం. పల్లవి రాగాలకు అనుగుణంగా చంధోబద్ధంగా వుండాలి.

(1) గీతం (2) స్వరజతి (3) వర్ణం (4) కృతి (5) పదం (6) జావళి (7) తిల్లానకీర్తన మొదలైనవి సాహిత్యంలో చంధోబద్దమైన పద్ధతులు.