Politics

ధరణిపై హైకోర్టు స్టే పొడిగింపు-ఉదయపు తాజావార్తలు

ధరణిపై హైకోర్టు స్టే పొడిగింపు-ఉదయపు తాజావార్తలు

నేటి వార్తలు (23.01.2021)

పుష్య మాసం దశమి శనివారం

నేడు సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్బంగా దేశభక్తి దినోత్సవం

1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు

1950 జనవరి 23న ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది

1977 జనవరి 23న ‘జనసంఘ్‌’, ‘భారతీయ లోక్‌దళ్‌’, కాంగ్రెస్‌ (ఓ), ‘స్వతంత్ర పార్టీ’, ‘సోషలిస్టు పార్టీ’లు కలిసి ‘జనతాపార్టీ’గా ఏర్పడ్డాయి

బ్రిటిష్ ప్రభుత్వంచే స్త్రీల వైద్యసేవల నిమిత్తం భారత్ లో తొలి వైద్యురాలిగా నియమితులయ్యారు, ప్రసూతి వైద్య నిపుణులు హిల్డా మేరీ లాజరస్ జయంతి మరియు వర్ధంతి

భారత స్వాతంత్ర్య సమరయోధుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, ఆచరణలో పెట్టిన వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, మరాఠీల ఆరాధ్యదైవం,భారత రాజకీయ నాయకుడు బాల్ థాకరే జయంతి

స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు కె. అచ్యుతరెడ్డి వర్ధంతి

దేశంలో గడచిన 24గంటలలో 14,545 మందికి కరోనా యాక్టివ్ కేసులు, 163 మంది మృతి

క‌ర్ణాట‌క‌ శివ‌మొగ్గ‌లో భారీ పేలుడు,8 మందికి పైగా మృతి, విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

వయసు, అనారోగ్యం దృష్ట్యా వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించడానికి మహా సర్కార్ అంగీకారం

హైదరాబాద్‌లోని పేదలకు శుభవార్త,ఇకపై వైద్య పరీక్షలన్నీ ఉచితమే, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్

పీవీ చ‌రిత్ర భావిత‌రాల‌కు అందించాల‌నేదే సీఎం కేసీఆర్ సంక‌ల్పం, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర విచారకరమని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌

అస్సాం, తేజాపూర్ యూనివర్సిటీలో 18వ వ్యాక్సిన్, మ‌న‌లో ఆత్మ‌విశ్వాసానికి కొద‌వ లేదు ప్రధాని నరేంద్ర మోడీ

మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్‌, తుదిరూపు ఇచ్చే పనిలో నిర్మలా సీతారామన్‌ బిజీ

బడ్జెట్‌ 2021లో ప్రభుత్వ సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకాల నుంచి పన్ను రహిత వడ్డీ ఆదాయం పొందాలని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు నివేదికలో సూచిస్తున్నారు.

అమెరికాలో కోవిడ్ మరణ మృదంగం.. రెండో ప్రపంచ యుద్ద మృతుల సంఖ్యను దాటేసిన కరోనా మరణాలు

ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో మంత్రి షాక్ ఇచ్చాడు. మంత్రి రాజీవ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రమంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు

కంచి నుంచి కృష్ణ శిల, 11 రోజుల్లోనే తయారీ, తిరుపతి నుంచి సీతారామలక్ష్మణ విగ్రహాలు రామతీర్థంకు తరలింపు

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టే ను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టే ను జూన్‌ 21 కు ఎక్స్‌టెన్డ్ చేసింది

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఆయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి..మై హోమ్ గ్రూప్‌ రూ. 5కోట్లు, మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 6కోట్లు.

మాజీ మంత్రి అఖిల ప్రియకు ఉపశమనం, కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు

దేశవ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్‌ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.కర్ణాటక టాప్, రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ. 100 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలిపారు. కొత్తగా రూ.100 నోట్లు మాత్రమే చెలమాణిలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మహేష్‌ వెల్లడించారు

దేశంలో చురుకుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రులకు వ్యాక్సిన్

హైదరాబాద్‌లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో మద్యంపై నిషేధం విధించాలని ఉమా భారతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నీతి అయోగ్‌ బృందం సమావేశం, పలు అంశాలపై చర్చ

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అగ్నిప్రమాదం కారణంగా రూ. 1000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు