ఏ విషయంలోనైనా తన మనఃసాక్షి ప్రకారమే నడచుకుంటానని చెప్పింది చెన్నై చిన్నది రెజీనా. సినిమాలకు సంబంధించి ఎవరి సలహాలు తీసుకోనని..ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితాన్ని అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటానని పేర్కొంది. ప్రస్తుతం ఈ సొగసరి తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసి ఎనిమిదేళ్లవుతోంది. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను కాబట్టి తొలినాళ్లలో ఇండస్ట్రీ పనితీరు గురించి సరైన అవగాహన ఉండేది కాదు. ఇక్కడ ఎన్నో నియమాలు, పరిధులు ఉంటాయి. చాలా మంది వాటినే అనుసరిస్తుంటారు. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఏ నియమాన్ని నేను అంగీకరించను. నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా. కథ నచ్చితే వెంటనే సినిమాకు అంగీకరిస్తా. ఎవరితోనే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం నచ్చదు. ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నా. నేనింకా ప్రయాణం మధ్యలోనే ఉన్నా. భవిష్యత్తులో కోరుకున్న అవకాశాలు వరిస్తాయనే విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చింది.
అదొకటి ఉందిగా…
Related tags :