కొవ్వు ఆహారం తగ్గిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు

రొమ్ముక్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే కొవ్వు పదార్థాలను తగ్గించండి. రొమ్ముక్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి కొవ్వులు తక్కువగా తినటం బాగా తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మామూలు ఆహారం తినేవారితో పోలిస్తే- పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు దండిగా తీసుకోవటం.. కొవ్వులతో కేవలం 20% కేలరీలు మాత్రమే లభించేలా చూసుకున్న మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 8% తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒకవేళ రొమ్ముక్యాన్సర్‌ తలెత్తినా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుండటమూ గమనార్హం. రొమ్ముక్యాన్సర్‌ బారినపడిన పదేళ్ల తర్వాత పరిశీలించగా- కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో 78% మందే జీవించి ఉంటుండగా.. తక్కువ కొవ్వు పదార్థాలు తినే మహిళల్లో 82% మంది హాయిగా జీవిస్తున్నట్టు తేలింది. వీరికి ఒక్క రొమ్ముక్యాన్సర్‌ మూలంగానే కాదు.. ఎలాంటి క్యాన్సర్లతోనైనా లేదా గుండెజబ్బులతోనైనా మరణించే ముప్పు సైతం తగ్గుతుండటం విశేషం. నెలసరి నిలిచిపోయిన 48,835 మంది మహిళలను దాదాపు 8 సంవత్సరాలు పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com