ఇస్రో ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహకనౌకను గురువారం ఉదయం 9.58 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. నాలుగు దశలుగా సాగిన ప్రయోగం విజయంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.పీఎస్‌ఎల్‌వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌(హెచ్‌వైఎస్‌ఐఎస్‌) ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. యూఎస్‌కు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com