నేనే గనుక కెప్టెన్ అయి ఉంటే….

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ వచ్చేనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొదటి టెస్టులో భాగంగా యువబ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌లను ఓపెనర్లుగా దింపాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రాణించగల సత్తా వారికుందని ఆయన అశాభావంవ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ టాప్‌ ఆర్టర్‌లో ఓపెనర్లుగా పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌లను పంపితే బావుంటుంది. ఓపెనర్‌గా మురళీ విజయ్‌ కాస్త మెరుగు పడాలి. నేనే గనుక కెప్టెన్‌ అయి ఉంటే అన్నీ సిరీస్‌లలోనూ షా, రాహుల్‌లను ఓపెనర్లుగా దింపేవాడిని. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరిద్దరిలో ఎవరు విఫలమయినా ఈ అవకాశాన్ని మురళీ విజయ్‌కి ఇస్తాను. నాకు తెలిసి వారి ప్రదర్శనను మెరుగు పరుచుకోవడానికి ఇదే మంచి సమయం. తానేంటో పృథ్వీషా నిరూపించుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. మరో మ్యాచ్‌లో 60కి పైగా పరుగులు చేశాడు. అతడికి క్రికెట్‌లో మంచి భవిష్యత్తు ఉంది. మరో 10-12ఏళ్ల వరకు అతడు నిర్విరామంగా ఆడవచ్చు. మ్యాచ్‌ సిరీస్‌లలో అతడి స్థానం దక్కడానికి మంచి అవకాశాలున్నాయి ’ అని పేర్కొన్నారు. ఇంగ్లాడ్‌తో చివరి రెండు మ్యాచ్‌ల నుంచి మురళీ విజయ్‌ తప్పుకొన్నాడు. ఆ తర్వాత గతనెలలో జరిగిన వెస్టిండీస్‌లో ఏ మ్యాచ్‌లోనూ అతడికి చోటు దక్కలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com