తులసి ఔషధ ఉపయోగాలు

☘☘☘☘☘☘☘☘
అజీర్ణం –
* 20 గ్రాముల అల్లం రసం మరియు 20 గ్రాముల తులసిరసం కలుపుకుని కొంచెం తేనె చేర్చి తీసుకున్న జీర్ణశక్తి వృద్ధిచెందును.
* తులసిరసం ఒక స్పూన్ కొద్దిగా పసుపునీరు కలిపి తాగిన జీర్ణశక్తి వృద్ది చెందును .
* తులసి ఆకులకు ఉప్పు చేర్చి సేవించుచున్న జీర్ణశక్తి వృద్ధిచెందును.
అతిసారం –
తులసి, పుదీనా, యాలుకలు కలిపి సేవించిన అతిసార వ్యాధిలో వచ్చు వాంతులు నయం అగును.
* తులసి దళములతో కొంచెం కర్పూరం చేర్చి నూరి కుంకుడు గింజ అంత మాత్రలు తయారుచేసి పూటకు ఒకటి చొప్పున మూడుపూటలా వాడిన కలరా వాంతులు నిలిచిపోవును.
* వనతులసి విత్తులను చూర్ణించి సేవించిన అతిసారం పోవును .
మూలరోగం –
* తులసి చూర్ణం 10 గ్రాముల వంతున ప్రతిదినం ఉదయం , సాయంత్రం వాడిన మూలరోగం తగ్గును.
* మొలలు ఎక్కువుగా భాధించుచున్న వేడిగా
ఉన్న పాలలోనికి ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి వేడివేడిగా తాగిన 10 నిమిషాలలో మొలలబాధ తగ్గును.
* తులసి విత్తనాలను నీటిలో పొద్దున నానవేసి సాయంత్రం సేవించుచున్న అలాగే రాత్రి నానవేసి పొద్దున్న సేవించుచున్న మూలవ్యాది నయం అగును.
ఉబ్బసం –
* శుక్ల తులసి ఆకు రసం నందు తేనె కలిపి సేవించిన ఉబ్బస దగ్గు నివారణ అగును .
* తులసి ఆకు రసమునకు శొంఠి , తేనె , నీరుల్లి రసములను కలిపి సేవించిన శ్లేష్మమును హరించి శ్వాస కాసలను పోగొట్టును .
ఉదరవ్యాధులు –
* తులసి విత్తనాల చూర్ణం పావు తులము , పటికబెల్లం చూర్ణం అర తులం కలిపి ఒక మోతాదుగా రోజూ రెండుపూటలా తినుచున్న యెడల కడుపు నొప్పులు , ఉబ్బరములు హరించిపోవును .
* తులసి రసం ఒకస్పూన్ అంతే పరిమాణం అల్లం రసం కలిపి ఒక గుంట గంటె లో వేసి వేడిచేసి పొంగించి ఆ కషాయాన్ని సేవించిన కడుపునొప్పి వెంటనే తగ్గును.
* ప్రతిదినం 20 తులసి ఆకులను తినుచున్న కడుపునొప్పులు పోవును .
* తులసి ఆకులు నీడన ఎండించి చూర్ణం చేసుకుని భద్రపరచుకొని ప్రతిదినం రెండున్నర గ్రాముల చూర్ణాన్ని పావు లీటరు పచ్చి ఆవుపాలతో కలిపి పుచ్చుకున్న కడుపులోని మంటలు హరించును .
ఉన్మాదము –
* తులసి దళములను ప్రతిదినము మూడు పూటలా నమిలి తినటం , మరియు తులసి రసమును శరీరం మొత్తం రుద్దుట వలన కఫం మరియు వాత సంబంధ ఉన్మాదములు నాశనం అగును.
* తులసి ఆకులు , దేవదారు ఆకులు సమానంగా తీసుకుని నూరి లేపనం చేసిన అరికాలు , అరచేయి మంటలు నివారణ అగును.
కడుపులోని బల్లలు హరించుటకు –
* చిన్నపిల్లల్లో కలిగే కాలేయ సంబంధమైన రోగములకు , అజీర్ణ సంబంధమైన రోగములకు తులసి ఆకుల తేలిక కషాయం (నీరు ఎక్కువ కలిపినది ) ఇచ్చిన వానిని పోగొట్టి పొట్టకు బలం చేయును . జీర్ణశక్తిని పెంచును.
* కొంతమంది చిన్నపిల్లలు పొట్ట పెద్దదిగా ఉండి కాళ్లు , చేతులు సన్నంగా ఉండి బలహీనంగా ఉండు పిల్లలకు తులసి రసం 10ml రోజూ రెండుపూటలా తాగించుచున్న యెడల పిల్లలు ఆరోగ్యవంతులు అగుదురు.
* తులసి ఆకుల రసమునకు అల్లం రసం కలిపి తేనెతో వాడిన బల్లలు హరించును . 40 రోజులు తప్పక వాడవలెను .
కడుపులో బల్లలు పెరగటం అనగా స్ప్లీన్ వాపు . మన్ను తినే పిల్లలకు ఈ సమస్య వచ్చును. కావున పిల్లలు మన్ను తినకుండా చూసుకొనవలెను.
కంటి రోగములు –
* కృష్ణ తులసి రసమును రాత్రివేళల్లో రెండు చుక్కల చొప్పున మూడు రాత్రులు కళ్ళలో వేసిన కంటి రోగములు కుదురును.
* పొధకి అనగా కంటిరెప్పలలో చిన్నపొక్కుల వలే లేచును . ఈ సమస్యకి తులసి రసం , వెల్లుల్లి రసం సమానంగా తీసుకుని కలిపి కంటిరెప్పలకు రుద్దిన పొధకి సమస్య పోవును .
* తులసి రసంలో మోదుగ గింజ నానబెట్టి అందులోనే నూరి ఆ గంధమును కాటుక వలే వాడిన కంటిపొరలు హరించును .
* తులసి దళములను ఆవువెన్నతో చిన్నసెగ మీద వెచ్చచేసి కంటి పైన ఉంచి కట్టు కట్టిన కంటి రెప్పల పైన లేచు మొటిమలు , వాపులు , కండ్లు మెరమెర లాడుట , నీరుకారుట, ఎరుపు, కండ్లు అంటుకొనుట మొదలగు సమస్యలు పోవును .
కుష్టు వ్యాధి –
* రామతులసి రసమును దీర్ఘకాలం సేవించుచున్న కుష్ఠు రోగము నివారణ అగును.
* గజకర్ణ కుష్టు సమస్యకు తులసిరసం ఆవునెయ్యి పాతది మరియు కొంచం సున్నం చేర్చి లేపనం చేసిన మంచి ఫలితం ఉండును.
* తులసి ఆకులను నిమ్మరసంతో నూరి పూసిన దద్దుర్ల వ్యాధి తగ్గును.
* తులసీదళములు ఎర్రమన్నుతో నూరి పూసిన దద్దుర్లు , దురదలు తగ్గును.
☘☘☘☘☘☘☘☘

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com