తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు అజారుద్దీన్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లుగా బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావెద్‌ను నియమిస్తూ ప్రకటనలో పేర్కొంది.