సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం నాడు స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నూతనంగా 25మందితో పాటు మొత్తం 125మంది రక్తదానం చేశారు. తదుపరి రక్తదాన కార్యక్రమాన్ని మే డే నాడు నిర్వహిస్తామని ఈ శిబిరం నిర్వాహకులు మేరువ కాశయ్య, కమిటీ సభ్యులు తెలిపారు. దాతలకు అధ్యక్షుడు కోటి రెడ్డి, కార్యదర్శి సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు.
సింగపూర్ ప్రవాసుల రక్తదానం
Related tags :