పాన్ కార్డు నిబంధనలు మారాయి బ్రదరూ!

పాన్ కార్డ్ రూల్స్ మారాయి… వివరాలు తెలుసుకోండి

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాన్ కార్డు నియమనిబంధనల్ని మార్చింది. అవి డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తాయి. మారిన నిబంధనలేంటో తెలుసుకోండి.

1. పాన్… పర్మనెంట్ అకౌంట్ నెంబర్… ఈ రోజుల్లో ఇది అందరికీ అవసరం అయిపోయింది. అయితే కొత్త పాన్ కార్డ్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నియమనిబంధనల్ని మార్చింది.

2. మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్, పార్ట్‌నర్, ట్రస్టీ, ఆథర్, ఫౌండర్, కర్త, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ ఆఫీసర్, ఆఫీస్ బేరర్ లాంటివాళ్లంతా పాన్ లేకపోతే మే 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

3. ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు, టర్నోవర్, గ్రాస్ రిసిప్ట్స్ రూ.5 లక్షలు దాటకున్నా వ్యాపారులు పాన్ కార్డు తీసుకోవాలి. ఇప్పటివరకు రూ.5 లక్షలు దాటినవాళ్లు మాత్రమే తీసుకోవాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు రూ.2.5 లక్షలు దాటినవాళ్లు తీసుకోవాలన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

4. పాన్ కార్డు దరఖాస్తులో కూడా మార్పులు వచ్చాయి. ఇకపై పాన్ దరఖాస్తులో తండ్రి పేరు చెప్పడం తప్పనిసరి కాదు. కేవలం తల్లితో నివసించే వాళ్లు తండ్రి పేరును దరఖాస్తులో పూర్తి చేయాల్సిన అవసరం లేదు.

5. ఆదాయపు పన్ను లెక్కింపుల కోసం పాన్ నెంబర్ కేటాయిస్తారు. కాబట్టి బ్యాంకు ఖాతా తెరవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం లాంటివాటికి పాన్ తప్పనిసరి.

6. ఇప్పటికే పాన్ ఉన్నవాళ్లు, వ్యక్తిగతంగా పన్నులు చెల్లించేవాళ్లు ఈ తాజా మార్పులతో కంగారుపడాల్సింది ఏమీ లేదు. ఈ మార్పులన్నీ వ్యాపారులకు మాత్రమే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com