దొండకాయ తప్పకుండా తినండి

మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దీనిని వివిధ రకాలుగా వండుకొని చపాతీతో, అన్నంతో తినొచ్చు. దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ఇది అపోహ మాత్రమే. దీనిలో అనేక పోషకాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. దొండకాయల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం, ప్రోటీన్లు కూడా లభిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. దొండకాయల్లోని యాంటీ- హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటి సమస్యలతో బాధపడేవారు దీన్ని తినడం వల్ల ఉపశమనాన్ని పొందొచ్చు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థను రక్షిస్తుంది. మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. దొండకాయను మధుమేహంతో ఉన్నవారూ తినొచ్చు. ఇది శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. దొండలో థైమీన్ పుష్కలంగా ఉంటుంది. కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకీ ఉపయోగపడుతుంది. ఇందులోని బీ- కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకి మేలుచేస్తాయి. దొండకాయల్లోని సి విటమిన్, బీటాకెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలో క్యాన్సర్ కారక కణాలను అడ్డుకుంటాయి.రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ను తగ్గిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com