* తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.
* రేపటి నుంచి పంచాయతీ తొలిదశ ఎన్నికలకు నామినేషన్లు..ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ కు అవకాశం.ఈ నెల 31 వరకు నామినేషన్లకు గడువు.వచ్చే నెల 9 న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు.నేడు తొలిదశ ఎన్నికల ఏర్పాట్లపై మోనిటర్ చేయనున్న ఎస్ఈసీ.
* ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా జరగనున్నాయి. వచ్చే నెల 17వ తేదీన జరిగే ఈ వేడుకలను ఈసారి గ్రాండ్‌గా జరపాలనే పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. పార్టీ నేతలు ఇప్పటికే ఆ మేరకు స్టేడియం నిర్వాహకులకు సమాచారం ఇచ్చి ఫిబ్రవరి 17ను రిజర్వు చేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తన ‘బర్త్ డే’ను కేవలం ప్రగతి భవన్‌కు మాత్రమే పరిమితం చేసుకున్నారు. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కుగానీ, మరో వేదికకుగానీ అవకాశం ఇవ్వలేదు.
* అశోక్ గజపతిరాజు ట్వీట్…రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా పూసపాటి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ ఈ రోజు కొట్టివేయడం జరిగింది. ఈ రోజు రామతీర్ధాలులో విగ్రహ ప్రతిష్ట అని టీ.వి. వార్తల ద్వారా తెలిసింది. ఈ శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే నన్ను ఆశీర్వదించి ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్ళీ కలిగించారు అని భావిస్తున్నాను.
* నెల్లూరు జిల్లా తడ సమీపంలో అధికారులు లుంగీ ధరించి, రుమాళ్లు చుట్టుకొని లారీ డ్రైవర్ వేషంలో వెళ్లారు. ప్రైవేట్ సిబ్బంది వారిని ముందే పసిగట్టారు.. అక్కడి నుంచి పరుగులు తీశారు.
* తెలుగుదేశం నేతలపై మరియు కార్యకర్తలపై ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా? మరియు కార్యకర్తల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కాల్ సెంటర్ నెంబర్ – +91 73062 99999
* పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 7.45 గంటలకు విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్లి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనంతపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఆ జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి సాయంత్రం 5.30గంటలకు కర్నూలు చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎల్లుండి కడప జిల్లా పర్యటనకు వెళ్లి ఆ జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించనున్నారు.
* రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగభృతి వస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని రేపోమాపో సీఎం కేసీఆర్ ప్రకటించవచ్చన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన టీఆర్వీకేఎస్ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘అంధకారమయం అవుతుంది.. చీకట్లు అలముకుంటాయి.. అనేలా ఉన్న తెలంగాణలో ఇవాళ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మా రాష్ట్రంలో కరెంట్ పోవట్లేదని ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కరెంటు కోతలు ఉండేవని.. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి కోతలుండవని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం’’ అని ఆయన చెప్పారు.
* కుంభమేళా నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వబోమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు.
* వచ్చే రెండేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
* పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.తొలి రోజు శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు.రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 16 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.కొత్త సాగు చట్టాలను ప్రతిపక్షాలు లేకుండా ఆమోదించారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఈ మేరకు గురువారం ఈ పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.
* గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు.
* ఢిల్లీలోని ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తూ పురాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.సాధారణ ప్రజలకు ఎర్రకోట సందర్శనకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 408వ రోజుకు చేరుకున్నాయి.
* రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ అధికారినీ వదలిపెట్టబోమని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
* రోజూవారీ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపు లోనే ఉంది. బుధవారం 7,25,653 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,666 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కొత్త కేసుల నమోదులో 8 శాతం తగ్గుదల కనిపించింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,07,01,193 కి చేరింది.
* బుధవారం తిరుమల శ్రీవారిని 47,399 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు.
* వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు..రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. కేసీఆర్ శ్రీమతి శోభ, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా వారణాసిలో పర్యటిస్తున్నారు అక్కడ పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసికి వెళ్లింది. రెండు రోజుల పాటు అక్కడే కుటుంబ సభ్యులు పర్యటించనున్నారు. సీఎం సతీమణి శ్రీమతి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తారు. తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. అస్సి ఘాట్ కు బోట్లో తిరుగు ప్రయాణం అవుతారు. సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శిస్తారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుడికి పట్టు వస్త్రాల కూడా సమర్పించనున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల వారణాసి పర్యటన ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ సీఎం అవుతారన్న వార్తల నేపథ్యంలో సీఎం కుటుంబం వారణాసి పర్యటన మరింత హాట్ టాపిక్ అయ్యింది. అక్కడ పలు ఆలయాల్ని దర్శించడంపై కూడా రాజకీయ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు