16 నుండి ధనుర్మాస ఉత్సవాలు-ఆధ్యాత్మికం

తిరుమలలో ధనుర్మాసం పూజలు డిసెంబరు 16న ప్రారంభమవుతాయి. ధనుర్మాస ఘడియలు ఆరోజు సాయంత్రం 5.19 గంటలకు ప్రారంభమై జనవరి 14న ముగియనున్నాయి. ధనుర్మాసం నేపథ్యంలో శ్రీవారికి నిత్యం వేకువ జామున జరిగే సుప్రభాత సేవ నెల రోజుల పాటు రద్దుకానుంది. ఈ మాసమంతా గోదాదేవి(ఆండాళ్) శ్రీవేంకటేశ్వరుణ్ని కీర్తించిన తిరుప్పావై సంకీర్తనా గానం జరుగుతుంది. ధనుర్మాసం 30 రోజులు శ్రీవేంకటేశ్వరస్వామి వారిని శ్రీకృష్ణునిగా భావించి పూజలు నిర్వహిస్తారు. స్వామి వారికి తిరుప్పావైగానం ఏకాంతంగా జరుగుతుంది.
*ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరాది నేపథ్యంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలతో పాటు తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు మాసంలో రెండు రోజుల పాటు కల్పించాల్సిన ప్రత్యేక దర్శనాలను నిలిపేస్తున్నట్లు వివరించింది.
2. అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తే తప్పేంటి?
అమరావతిలో తితిదే నిధులతో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. 7 నక్షత్రాల హోటల్, మద్యం దుకాణాలను నిర్మించడం లేదు కదా? అని వ్యాఖ్యానించింది. అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రూ.150 కోట్ల తితిదే నిధులతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చర్యలు ప్రారంభం అయ్యాయని, దీనిని అడ్డుకోవాలంటూ తిరుపతి నివాసి పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.23.10 లక్షలు ఉంటే.. ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల్ని తితిదేకు అధికారులు కేటాయించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి 2014సెప్టెంబరులో తితిదేకు సూచిస్తే.. 2018 నవంబర్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దేవాలయం నిర్మాణంపై పురోగతి ఉంటుందని గుర్తుచేసింది. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇది ప్రజాహితం కోసం వేసిన వ్యాజ్యంగా లేదని ప్రచారం కోసం వేసిన దానిలా ఉందని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతిమంగా జరిమానా విధించకుండా కేవలం వ్యాజ్యాన్ని కొట్టేసింది.
3. దుర్గమ్మ సేవలో భారత్ మహిళా క్రికెటర్లు
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దేశ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో కలిసి సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్, సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. పాలకమండలి సభ్యులు పెంచలయ్య, శంకర్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మిథాలీరాజ్‌తో దేవస్థానం ఉద్యోగులతో పాటు క్రికెట్ అభిమానులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.
4. రామ మందిరం కోసం అశ్వమేథయాగం ప్రారంభం
విశ్వవేదాంత సంస్థాన్ ఇప్పుడు ‘అయోధ్య చలో’ నినాదాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి 4వ తేదీవరకూ అయోధ్యలో అశ్వమేధయాగాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఆనంద్ జీ మహారాజ్ మాట్లాడుతూ ‘రామ మందిరం నిర్మాణం కోసం చేపడుతున్న ఆందోళన.. ప్రజా ఆందోళనగా మారడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అయోధ్యలో రామ మందిరం నిర్మించక తప్పదు. మరి ఎందుకింత జాప్యం? ప్రధాని ఇప్పటికైనా ప్రధానమంత్రి రామ మందిరం నిర్మాణం తేదీని ప్రకటించాలి. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్న యాగంలో వెయ్యిమంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. 11 వేల మంది సన్యాసులు హాజరవుతున్నారు. ఆలయ నిర్మాణానికి ఈ యాగమే మొదటి అడుగు’ అని అన్నారు.
5. తిరుమల సమాచారం
ఈ రోజు శనివారం
*01.12.2018*
ఉదయం 5 గంటల
సమయానికి,
నిన్న *59,024* మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శనభాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో భక్తులు
*03* గదుల్లో వేచియున్నారు,
శ్రీవారి సర్వదర్శనానికి
సుమారు *06* గంటల
సమయం పట్టవచ్చును,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.49* కోట్లు,
నిన్న *22,760* మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు,
**తిరుపతి స్థానిక ఆలయ
సమాచారం(సా: 05 కి)
భక్తులకి తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన
భాగ్యం కల్గినది,
* నిన్న *5,130* మంది
భక్తులకి శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర
స్వామి వారి దర్శన భాగ్యం
కల్గినది,
* నిన్న *09,016* మంది
భక్తులకు శ్రీ గోవిందరాజ
స్వామివారి దర్శన భాగ్యం
కలిగినది,
* భక్తులకు అప్పలాయగుంట
శ్రీ పసన్న వేంకటేశ్వర
స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.
6. శుభమస్తు
తేది : 1, డిసెంబర్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
తువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
ారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 19 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 31 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : గరజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 11 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 48 ని॥ వరకు)
మ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 8 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 5 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 7 గం॥ 58 ని॥ నుంచి ఉదయం 8 గం॥ 42 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 9 గం॥ 16 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 6 గం॥ 29 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 52 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ నుంచి మద్యాహ్నం 2 గం॥ 50 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : సింహము

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com