శబరిమలలో మహిళల గోడ

శబరిమల అంశం పూర్తిగా రాజకీయ మలుపు తీసుకుంది.

ఆలయంలోకి మహిళలను రానీయకుండా సోమవారం నుంచి బీజేపీ తమ నిరసనను తీవ్రతరం చేయనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓ మహిళల గోడను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర మంత్రి థామస్ ఐజాక్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. శబరిమల అంశంపై సోమవారం నుంచి సెక్రటేరియట్ ముందు తాము నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిైళ్లె చెప్పారు.

శబరిమల విషయంపై పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు బీజేపీ ఉంచింది.

ప్రస్తుతానికి 15 రోజుల పాటు ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు శ్రీధరన్ తెలిపారు.

ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశగా మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా జనవరి 1న పది లక్షల మంది మహిళలతో ఓ మహిళల గోడను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.

కసరగుడె నుంచి రాజధాని వరకు 600 కిలోమీటర్ల మేర మహిళలతో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శన ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com