రూ.500 కోట్లు ఇచ్చిన షిర్డీ ఆలయ ట్రస్ట్

మహారాష్ట్రలోని ప్రవర నదిపై ఉన్న నీల్‌వాండే డ్యామ్‌ కాలువల నిర్మాణం కోసం షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాలువల నిర్మాణం వల్ల అహ్మద్‌నగర్ జిల్లాతోపాటు నాసిక్‌ సిన్నార్‌లోని సంగమ్‌నెర్, అకోలె, రహత, రాహురి, కోపర్గో తహశీల్‌లలోని 182 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.ఆర్థిక సాయంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోదావరి-మరాఠ్వాడా ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు సాయి ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పిన ఆయన వడ్డీ మాత్రం వసూలు చేయబోమన్నారు. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు వెచ్చించడం ఆలయ ట్రస్ట్‌కు కొత్త కాదని, అయితే, నీల్‌వాండే డ్యామ్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారిని, ఇది చాలా అరుదైన ఘటన అని ఆయన వివరించారు.రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు మాట్లాడుతూ నీల్‌వాండే డ్యామ్‌లో నీటి నిల్వ ప్రారంభమైందని, అయితే, వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాల్వలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.350 కోట్లతో కాకడి గ్రామంలో నిర్మించిన విమానాశ్రయం కోసం షిర్డీ టెంపుల్ ట్రస్ట్ గతంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీకి రూ. 50 కోట్లు అందించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com