* నెల్లూరులో విషాదం…పడారుపల్లిలో ఓ లాడ్జీలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఒకేతాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య.ప్రేమ వ్యవహారమే అని వేటపాలెం పోలీసుల అనుమానం.మృతులు ఇద్దరూ చిట్టమూరు మండలం మెట్టు సచివాలయం ఉద్యోగులుగా గుర్తించిన పోలీసులు.
* మచిలీపట్నంలో కరోనా వ్యాక్సిన్ తో తీవ్ర అస్వస్థకు గురైన స్టాప్ నర్స్ ఘటనపై..జి కొండూరు అంగన్వాడీ ఆయా ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా.
* ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం.. డివైడ్ ను ఢీ కొట్టిన కారు.. ఐదుగురికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం.హైదరబాద్ మహానగర శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన రాజేంద్రనగర్ సమీపంలోని ఓఆర్ఆర్‌పై జరిగినట్లు పోలీసులు తెలిపారు. హిమాయత్‌సాగర్ వద్ద షిప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
* దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన ఉగ్రదాడిగా తెలుస్తోంది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-హింద్ సోషల్‌మీడియాలో ప్రకటించుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జైష్‌కు చెందిన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
* చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజిని అన్నారు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు శనివారం ఆమె ప్రయత్నించారు. అయితే, నిందితులను నేరుగా కలిసేందుకు అధికారులు ఆమెకు అనుమతివ్వలేదు. దీంతో జైలు ద్వారం వద్ద దూరంగా నిలబడి నిందితుల్లో ఒకరైన పురుషోత్తంనాయుడుతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. అనంతరం సోమవారం రావాలని చెప్పి జైలు అధికారులు న్యాయవాదిని పంపించేశారు.
* కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్ కో ప్యార్ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని వలచాడు. బహుమతులిచ్చాడు. చాటుమాటుగా సరసాలాడాడు. అంతదాకా బాగానే ఉందిగానీ ఆమెపై వ్యామోహం ఎక్కువై భార్య క్రెడిట్ కార్డుతో గాళ్‌ఫ్రెండ్ వాహనం చలాన్లు కట్టి అడ్డంగా దొరికిపోయాడు. దుబాయ్‌లో జరిగిందీ చిత్రమైన సంఘటన.
* ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్-ఆగ్రా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. హుసైన్‌పుర్‌లోని కుందర్కి సమీపంలో బస్సు-ట్రక్కు ఓవర్‌టేకింగ్ చేసుకుంటూ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దట్టమైన పొగమంచు ఉండటంతో రహదారిపై ఉన్న ఆ వాహనాలను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా 25 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.
* మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీ కొని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఎర్రకుంట తండా వాసులు. ఇటీవలే కుమార్తె పెళ్లి కుదరడంతో నూతన దుస్తుల కొనుగోలు కోసం వధువుతో సహా వరంగల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ కిందకు వెళ్లిన ఆటోను ప్రొక్లెయినర్ సాయంతో బయటకు తీశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
* నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 14 తులాల బంగారం, రూ.10వేల నగదు అపహరణకు గురైంది. నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఎమ్‌ఎస్-3లో గల మైనంపల్లి హనుమంతరావుకు చెందిన 305 ఫ్లాట్‌లో ఈ చోరీ జరిగింది. ప్రస్తుతం ఆ ఫ్లాట్‌లో హనుమంతరావు స్నేహితుడు బోధన్‌కు చెందిన అమర్‌నాథ్‌బాబు ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకి అమర్‌నాథ్‌బాబు బోధన్ వెళ్లాడు. తిరిగి 23వ తేదీ హైదరాబాద్ వచ్చాడు. 25వ తేదీన బీరువా తెరవగా అందులోని నగలు, నగదు కనిపించలేదు. ఈ విషయమై అతని బంధువులు, డ్రైవర్‌ను అడగ్గా ఎలాంటి ఫలితం లేకపోయింది. అనంతరం ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా అటునుంచి కూడా ఎలాంటి సహాయం అందకపోవడంతో చివరకు శుక్రవారం రాత్రి నారాయణగూడ పోలీసులకు అమర్‌నాథ్‌బాబు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనానికి పాల్పడింది తన డ్రైవరే అని అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్, ఇంట్లో పనిమనిషిని విచారిస్తున్నట్లు వారు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.