Business

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవి-వాణిజ్యం

* ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సెలవులు వివరాలు చూస్తే ఫిబ్రవరి 7- ఆదివారం, ఫిబ్రవరి13- రెండో శనివారం, ఫిబ్రవరి 14- ఆదివారం, ఫిబ్రవరి 21- ఆదివారం, ఫిబ్రవరి 27- నాలుగో శనివారం, ఫిబ్రవరి 28- ఆదివారం బ్యాంకులకు సెలవు. కేవలం ఫిబ్రవరి నెలలో ఆరు రోజులు మాత్రమే బ్యాంకులు సెలవు ఉంటాయి మిగిలిన 22 రోజులు యధావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి అందుచేత ఈ నెలలో పూర్తిస్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది

* కిషోర్‌ బియానీ నేతృత‍్వంలోని ఫ్యూచర్‌ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్‌ రీటైల్‌ డీల్‌ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్‌ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్‌ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్‌ గ్రూపు సీఈఓ కిషోర్‌ బియానీ సంచలన వ్యాఖ‍్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్‌ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ‍్యంగా వ్యాఖ్యానించారు.

* దేశంలో బిట్‌కాయన్‌పై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. తాజా పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం సిద్దం చేసింది. తద్వారా బిట్ కాయిన్, ఈథర్, రిపెల్‌ లాంటి ప్రైవేటు డిజిటల్ కరెన్సీలపై వేటు వేయనుంది. అంతేకాదు సొంత క్రిప్టో క‌రెన్సీని లాంచ్‌ చేయాలని కూడా ప్లాన్‌ చేస్తోంది.

* ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ 2020 డిసెంబర్‌లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్‌ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్‌లోని క్రూడ్‌ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్‌ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్‌లో ఈ గ్రూప్‌ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్‌ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి.

* కోవిడ్‌-19 సంక్షోభం, ఆకాశాన్నంటిన ధరలతో పసిడికి డిమాండ్‌ భారీగా పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020 సంవత్సరంలో దేశీయంగా పుత్తడి డిమాండ్‌ 25 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2020 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 25 సంవత్సరాల కనిష్టానికి చేరింది.

* కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్‌, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి‌ పేర్కొన్నారు.