Fashion

నిద్రలేమి ఓ పెద్ద సమస్య

నిద్రలేమి ఓ పెద్ద సమస్య

ఈమధ్యకాలంలో ఎవర్ని చూసినా ఒకటే సమస్య… నిద్రలేమి. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోకపోతే చికాకు, అలసటలతోబాటు మానసిక, శారీరక ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తుంది. ముఖం కాంతివిహీనమైపోతుంది. ఆరోగ్యానికి మంచినిద్ర చాలా అవసరం. అందుకోసం ఇలా చేసి చూడండి.
* ప్రతిరోజూ కనీసం ఓ పది నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం పాటు క్రమం తప్పక చేస్తే అది అలవాటుగా మారుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.
* బెడ్‌కు సమీపంలో ల్యాప్‌టాప్‌లూ టీవీలూ ఫోన్లూ వంటి గాడ్జెట్లేమీ లేకుండా చూసుకోండి. వాటి నుంచి వచ్చే నీలి కాంతి మిమ్మల్ని సరిగ్గా నిద్రపోనీయదు. ఎందుకంటే అది మీ మెదడుకి పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది.
* పడుకునేముందు శ్రావ్యమైన సంగీతం వింటే కూడా నిద్ర బాగా పడుతుంది.
* కొంతమంది పడుకునేముందు థ్రిల్లర్‌, హారర్‌ నవలలు చదువుతుంటారు. వాటికి సంబంధించిన భయానక దృశ్యాలూ సంఘటనలూ అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా నిద్రపోనీయవు.
* రాత్రిపూట ఎక్కువగా తినకండి. నిద్రకీ భోజనానికీ మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చేసుకోండి. వీలయితే ఓ గంటముందు ఛమేలీపూల టీ లేదా గుప్పెడు బాదం, అక్రోట్లు తింటే బెటర్‌. ఇన్ని చేసినా పట్టకపోతే డాక్టర్ని సంప్రదించాల్సిందే.