సుఖమయ జీవనానికి 18సూత్రాలు-ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక జీవనంలో అయ్యప్ప దీక్ష ప్రత్యేకం. మండల రోజులు నియమ నిబంధనలతో నిష్ఠగా పూజలు చేసి ఇరుముడి నెత్తిన పెట్టుకుని కొండలు దాటి పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కేందుకు భక్తులు దీక్షబూనుతారు. నియమాల మాల వెనుక ఆరోగ్య మంత్రం, 18 మెట్లలో ప్రగతి సోపానంతోపాటు జీవిత పరమార్థం దాగి ఉంది. చెడు అలవాట్లకు దూరంగా 41 రోజులపాటు కొనసాగించిన దీక్షను విరమించిన తర్వాత సన్మార్గంలో ముందుకు సాగితే జీవితానికి సార్ధకత చేకూరుతుందని గురుస్వాములు చెబుతున్నారు. శబరిమల సన్నిధిలో పదునెట్టాంబడికి ఉన్న విశిష్టత.. ఒక్కో మెట్టులో ఉన్న జీవిత పాఠాలపై ప్రత్యేక కథనం.
**శబరికొండలో 18 మంది దేవతలు 18 మెట్లుగా ఏర్పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప భక్తులు దీక్షలు చేపట్టి నియమాలు పాటించి ఈ మెట్లు ఎక్కితే వారికి ఆయా దేవతల అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. శాస్త్రీయ కోణంలో ఒక్కో మెట్టు మనిషిలోని ఒక్కో వ్యసనాన్ని పారద్రోలేందుకు సూచికగా ఉన్నాయని చెబుతుంటారు.
**1 నుంచి 5
ఒకటి నుంచి ఐదు మెట్లను పంచ ఇంద్రియాలుగా అభివర్ణిస్తారు. మొదటి మెట్టు చెవులు, రెండో మెట్టు కనులు, మూడో మెట్టు చర్మం, నాలుగో మెట్టు ముక్కు, ఐదో మెట్టు నాలుక. ఈ పంచేంద్రియాలను అనుసరిస్తే లక్ష్యసాధనకు మార్గాలుగా నిలుస్తాయి.
**6 నుంచి 13
ఆరో మెట్టు కామ, ఏడో మెట్టు క్రోద, ఎనిమిదో మెట్టు లోబ, తొమ్మిదో మెట్టు మోహ, పదో మెట్టు మద, పదకొండో మొట్టు మత్సర్య, పన్నెండో మెట్టు అహంకారం, పదమూడో మెట్టు తత్వం నియంత్రణకు సూచికలుగా నిలుస్తాయి. మనిషిలోని చెడుని పలికించే ఈ ఎనిమిది అలవాట్ల వల్ల మనిషి నాశనం వైపు పయనించేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. వీటి నియంత్రణకు ఈ మెట్లు ఎక్కే భక్తులు అధిక ప్రాధాన్యం ఇచ్చి మార్పుని స్వీకరిస్తే ప్రశాంతమైన జీవనం గడపడానికి నాంది అవుతుంది.
**14 నుంచి 16
పద్నాలుగో మెట్టు సత్యం, పదిహేనో మెట్టు రజో, పదహారో మెట్టు తామసలైన త్రిగుణాలను సూచిస్తున్నాయి. ఎప్పుడు సత్యం పలుకుతూ మంచినే కోరుకోవాలని ఈ మెట్ల పరమార్థం.
**17 నుంచి 18
చివరి రెండు మెట్లు ఎంతో ప్రత్యేకమైనవి. పదిహేడో మెట్టు అజ్ఞానాన్ని తొలగించడానికి, పద్దెనిమిదో మెట్టు విజ్ఞానంతో విజయం సాధించాలని సూచిస్తున్నాయి. ఈ 18 మెట్లు (పదునెట్టాంపడి) ఏడాదికి ఒకటి చొప్పున మాలలు ధరించే భక్తుల్లో మార్పును సూచిస్తున్నాయి.
**నియమాల తోరణం
అయ్యప్ప మాలధారణ కఠినమైన నియమాలతో ముడిపడి ఉంటుంది. ఈ నియమాలను పాటిస్తే ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
**శిరస్నానం
అభ్యంగ స్నానం దేవునికి ప్రీతికరం. మనసుకు చన్నీటి స్నానం హాయినిస్తుంది. చెడు భావాలను దూరం చేస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత కుదురుతుంది. ఆలోచనలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. పని చేస్తున్నప్పుడు ఉష్ణం పుడుతుంది. అధికం ఉష్ణం వల్ల ఆరోగ్యానికి నష్టం. చన్నీటి స్నానం వల్ల ఉష్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
**మితాహారం
మితాహారమే ఆరోగ్యం. మితాహారం తీసుకోవడం ద్వారా కొవ్వు శరీరంలో చేరేందుకు ఆస్కారం ఉండదు. ఒక్కపూట భోజనం రెండు పూటల అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఏ పనికైనా ఉత్సాహంగా అడుగులు వేయవచ్చు.
**వస్త్రధారణ
అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల వారిపై శనిదేవుడు చూపు పడదని భక్తుల విశ్వాసం. నలుపు ఆకర్షణలకు దూరంగా ఉండి ఇహపర సుఖాలను త్యజించమని చెబుతుంది. నలుపు రంగు ఉష్ణాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. దేహ ఉష్ణోగ్రతను దీక్ష ఉపవాసాలుగా తగ్గించేస్తాయి. ఈ దుస్తులు ఉష్ణాన్ని సమతుల్యం చేస్తాయి.
**భూతల శయనం
భూమి తల్లితో సమానం. నేలపై పడుకుంటే దేవుని ఒడిలో పడుకున్నట్లే. హంస తూలికాతల్పాలు ఇవ్వలేని మనశ్శాంతి, సుఖం భూతల శయనం ఇస్తుందనేది ప్రాచీనుల విశ్వాసం. మనసు కకావికలం అయినప్పుడు భూమి మీద నిశ్చలంగా కొద్దిసేపు పడుకుంటే అన్నీ దూరమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. సమాంతర స్థితిలో శక్తి మార్పిడి పొందుతుంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది.
**పాదరక్షలతో అపరిశుభ్రం
పాదరక్షలు అపరిశుభ్రతకు చిహ్నం. వాటితో దైవ సన్నిధికి చేరకూడదు. శబరిమలకు వెళ్లే దారంతా అడవి మార్గం. కొండలు, రాళ్ల మధ్యన పాదరక్షలు లేకుండా నడవడం, ఎక్కడం సాధ్యం కాదు. దీనికి ముందస్తు సాధనగానే పాదరక్షల విస్మరణ. పాదాలు నేరుగా భూమిని స్పర్శిస్తుండటం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్తప్రసరణలు, హృదయ స్పందనలు సమమవుతాయి.
**చందనం ఆరోగ్యం
నుదురు దైవస్థానం. భృకుటి స్థానంలో పెట్టుకునే నామం దైవానికి ఎంతో ఇష్టం. రెండు కనుబొమ్మల మధ్యన నుదుటి భాగం యోగ రీత్యా విశిష్ఠమైంది. పాల భాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. దానికి అనుగుణంగా అక్కడ కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు. నాడీ మండలానికి కేంద్రం నుదుటి భాగం. అక్కడ సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయం.

1. శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులను రప్పించే యోచన
శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి మరింత పెద్ద సంఖ్యలో భక్తులను రప్పించేందుకు వీలుగా సినీతారలతో సహా పలువురు ప్రముఖులతో ప్రకటనలు ఇప్పించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ప్రతిపాదించింది. దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రెండునెలల పాటు మండలం-మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరిచి రెండువారాలకు పైగా అవుతున్నప్పటికీ భక్తుల సంఖ్య చాలా పలుచగా ఉండటంతో టీడీబీ ఈ యోచనలో పడింది.

2. భక్తసులభుడు..శంకరుడు
“ఓం పంచ వక్త్రాయ విద్యహే, మహావేదాయ ధీమహీ తన్నో రుద్ర: ప్రచోదయాత్‌” అని ఆది శంకరులు కీర్తించారు. శివ నామం గంగా నది లాంటిది. ఆయన ధరించే విభూది యమునా నది లాంటిది. రుద్రాక్ష సర్వపాపాలూ దహించే సరస్వతీ నది. ఇదే త్రివేణి సంగమం! శివలింగానికి అడుగున బ్రహ్మ, మధ్య పీఠంలో విష్ణువు. లింగాగ్రంలో పరమేశ్వరుడూ ఉంటారు. కనుక ఆయన పూజ సర్వదేవతల పూజ. ఆ పరమేశ్వరుడి దర్శనం సర్వపాపహరణం. కార్తీక మాసం ప్రత్యేకంగా హరిహరాదులకు ప్రీతికరమైన మాసం. అందుకే కార్తీకమంతా శివాయగురవే నమ: అంటూ, శివోహం అంటూ భక్తులందరూ వివిధ శైవ క్షేత్రాలలో ఆ జగత్పిత దర్శనం చేసుకుని తరిస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కీసర గుట్ట సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. నిత్యం దర్శించుకునే భక్తులతో ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండే మన కీసరగుట్ట క్షేత్రం (హైదరాబాద్)కి 40.కి.మీ. దూరంలో ఉంది. ఆ శంకరుడు శ్రీరామలింగేశ్వరుడిగా స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రం.
**పురాణకథ
పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యనగరానికి తిరిగి వెళుతూ.. మార్గమధ్యలో కీసర గట్టు కొండమీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణ ప్రభావం వల్ల శ్రీరామచంద్రునికి ఒక ఆలోచన కలిగిందట. అదేమిటంటే, రావణుడిని సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టించాలనుకుంటాడు. అందులో భాగంగానే .. ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని ఆలోచన కలిగింది. దాంతో అక్కడున్న మహర్షులతో తన ఆలోచన గురించి వివరించగా అంతా ఆలోచించి ఆ ప్రదేశంలో శివ లింగాన్ని ప్రతిష్టించడానికి ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుడిని పిలిచి.. కాశీ నుంచి శివ లింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు.
**దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హనుమంతుడు ఆకాశంలో ఎగురు కుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే రాజర్షులు నిర్ణయించిన సుముహూర్త సమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికి కనిపించ లేదు. ఎందుకు ఆలస్యమవుతోంది? నా సంకల్పం నెరవేరదా అని శ్రీరాముడు మనసులో ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోనే శంకరుడు, రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి ముహూర్త సమయమునే ప్రతిష్టించమని చెప్పి..అదృశ్యమైపోతాడు. ముహూర్తం దాటిపోతుందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్టించాడు. కానీ ఇంతలోనే ఆంజనేయుడు నూటొక్క శివలింగాలను తన భుజాల మీద మోసుకుని రామచంద్రుని ముందు వాలాడు. తను రావడానికి ముందే అక్కడున్న పరిస్థితులను, ఆత్మలింగాన్ని ప్రతిష్టించడం చూసి చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా ఒక్కసారిగా వృథా అయిందని.. ఉక్రోషంతో తాను తెచ్చిన శివలింగాలను కొండపైన ఎక్కబడితే అక్కడ బాధతో విసిరేశాడు. అయితే శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు చేసిన చేష్టలకు కోపగించుకోకుండా, చిరునవ్వుతోనే అనుగ్రహించి, దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు.
**“ఆలయంలో ఈశ్వర దర్శనానికి ముందే, నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తరువాతే శ్రీరామ లింగేశ్వరునిని దర్శించుకుంటారు.” అని వరమిస్తాడు. ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా “ కేసరి గిరి” గా ఆ ప్రాంతాన్ని పిలుస్తారని అనుగ్రహించాడు. అలా కేసరి గిరి” కాల క్రమంలో కీసరిగిరి, కీసర, కీసరగుట్టగా మారిపోయింది.
చారిత్రక విశిష్టత: క్రీ.శ. 4-లేదా -5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండిన ప్రభువైన రెండవ మాధవవర్మ రాజధానియైన “ఇంద్రపాలనగరం” ఇదే నని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పదకొండు ఆశ్వ మేధయాగాలు చేసి, తన సామ్రాజ్యాన్ని నర్మదానదీ తీరం వరకు విస్తరింప జేసిన మహావీరుడు రెండవ మాధవవర్మ. అంటే ఎన్నో యజ్ఞ యాగాదులతో పునీతమైన పవిత్ర భూమి ఈ కీసరగుట్ట. ఈ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించిన పునాదులు, బయటపడ్డాయి. కొన్ని శిథిల కట్టడాలు అక్కడక్కడ కనిపిస్తాయి.
**క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కోండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో లక్ష్మ నృశింహ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం కలదు. ఈ స్తంభంపై మత్స, కూర్మ, వరహ, ఆంజనేయ విగ్రహాలు చెక్కి ఉన్నాయి.

3. భద్రాచలం, వేములవాడకు పోటెత్తిన భక్తజనం
కార్తికమాసం నాలుగో సోమవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్త ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం బారులు తీరడంతో స్వామి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. అధికారులు భక్తులకు శ్రీఘ్ర దర్శనం అమలు చేస్తున్నారు. ఈ సాయంత్రం ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి నదిలో కార్తిక దీపాలు వదులుతున్నారు.

4. ముక్కంటి క్షేత్రం… మొగిలీశ్వరాలయం
‘మహప్రాణ దీపం శివం’ అంటూ కీర్తించినా… ‘శివశివ శంకర భక్తవశంకర’ అంటూ స్తుతించినా శివ భక్తుల హృదయాలు ఆనంద పారవశ్యంలో మునిగిపోతాయి. ఈశ్వర తత్వంలోని ఔన్నత్యం అలాంటిది. నమ్మి కొలవాలే కానీ దేవతలూ రాక్షసులూ అన్న భేదం లేకుండా అందరికీ వరాలిచ్చేసే శివయ్యకు తన భక్తులంటే మరింత ప్రేమ. దానికి నిదర్శనమే చిత్తూరులోని మొగిలీశ్వరాలయం. తనను సేవించిన భక్తుడి పేరుమీదుగానే ఈ క్షేత్రంలోని శివయ్య పూజలందుకోవడం విశేషం. మహాశివుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు, గంగాధరుడు, పార్వతీవల్లభుడు, త్రినేత్రుడు… ఇలా ఆ సర్వేశ్వరుడికి పేర్లు అనేకం. మహిమలు అనంతం. మంజునాథుడు అనేక ప్రాంతాల్లో, విభిన్న నామాలతో పూజలందుకుంటున్నాడు. వాటిలో చిత్తూరులోని మొగిలీశ్వర ఆలయం ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తారు.
**ఇదీ కథ
పూర్వం ఈ ప్రాంతంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండేవట. వీటి సమీపంలో ఉన్న మొగిలివారిపల్లెలో బోయ దంపతులు నివసించేవారు. అతడి భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు రావడంతో అడవిలోనే మగ శిశువును ప్రసవించింది. మొగలిపొదల దగ్గర పుట్టాడు కాబట్టి ఆ బిడ్డను మొగిలప్ప అని పిలవడం ప్రారంభించారు. మొగిలప్ప పెద్దవాడయ్యాక ఓ రైతు దగ్గర పశువులకాపరిగా చేరాడు. పశువులను అడవికి తోలుకెళ్లి మేపుతూ మధ్యలో వంట చెరకు నరికేవాడు. అలా ఒక రోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతుంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురైన మొగిలప్ప గ్రామస్థుల సాయంతో అక్కడ వెతకగా శివలింగం కనిపించింది. అప్పటి నుంచీ ఆ శివలింగానికి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు మొగిలప్ప. దీంతో అతడి పేరు మీదుగా ఈ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.
**త్రిశూల తీర్థం
భక్తులు మొగిలి క్షేత్రంలోని త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఓసారి కరవు వచ్చి నదులూ, సరస్సులూ ఎండిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా… శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమిమీద గుచ్చి, పాతాళ గంగను పైకి రప్పించాడట. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థంగా వ్యవహరిస్తారు.
**ప్రత్యేకతలు
మొగిలీశ్వరాలయానికి పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో విభూతి కొండ ఉంది. ఈ క్షేత్రంలో స్వయంభూ లింగంతోపాటు సహజంగా ఏర్పడిన విభూతి కొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ కొండకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని సూచన మేరకు లోక కల్యాణం కోసం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెబుతారు. ఆలయంలోని మరో ప్రత్యేకత పైకప్పుమీద దర్శనమిచ్చే బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీకాళహస్తిలలో మాత్రమే కనిపిస్తుంది. బంగారు బల్లితోపాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతోపాటు అన్ని దోషాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం.
**ఇలా చేరుకోవచ్చు
చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. తిరుపతి నుంచి కుప్పం, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కాణిపాకానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

5. తిరుమల సమాచారం
ఈ రోజు సోమవారం
*03.12.2018*
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: *18C° – 24C°
నిన్న *81,080* మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శనభాగ్యం కలిగినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో భక్తులు
*09* గదుల్లో వేచియున్నారు,
శ్రీవారి సర్వదర్శనానికి
సుమారు *07* గంటల
సమయం పట్టవచ్చును,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.05* కోట్లు,
నిన్న *28,743* మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు,
తిరుపతి స్థానిక ఆలయ*
*సమాచారం(సా: 05 కి):*
నిన్న *16,798* మంది
భక్తులకి తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన
భాగ్యం కల్గినది,
నిన్న *____* మంది
భక్తులకి శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర
స్వామి వారి దర్శన భాగ్యం
కల్గినది,
నిన్న *11,045* మంది
భక్తులకు శ్రీ గోవిందరాజ
స్వామివారి దర్శన భాగ్యం
కలిగినది, నిన్న *1,852* మంది
భక్తులకు అప్పలాయగుంట
శ్రీ పసన్న వేంకటేశ్వర
స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది,

6. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలవబడుతున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*ఘనంగా అంకురార్పణ
కాగా, సాయంత్రం 6.00 నుంచి 8.30 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.
*డిసెంబరు 4న ధ్వజారోహణం
ఆలయంలో మంగళవారం ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, ఉదయం 8.30 నుండి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8.00 నుంచి 11.00 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

7. కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయానికి పోటెత్తుతున్న భక్తులు
కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం శివ కేశవులకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కపిలేశ్వర స్వామివారిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో అర్చించినట్లయితే శివస్థానాన్ని పొందుతారని పురాణ ప్రశస్తి. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే కార్తీక మాసంలో పుణ్యస్నానం, పుణ్యయోగుల దర్శనం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుంది. ాంటి పవిత్రమైన కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం విశేష సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు దీపారాధన చేసి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశేషపూజ మరియు హోమ మహోత్సవాలు చేపట్టారు. నవంబరు 8వ తేదీన గణపతి హోమంతో ఈ హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవగ్రహ హోమం, శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం)నిర్వహించారు.
ప్రస్తుతం డిసెంబరు 5వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం) జరుగుతోంది. ఇందులో పాల్గొన్న భక్తులకు విద్యాప్రాప్తి, వివాహం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు వెల్లడించారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. అనంతరం డిసెంబరు 6వ తేదీ శ్రీ కాలభైరవస్వామివారి హోమం, డిసెంబరు 7న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com