బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన ఓ చెత్త జోక్‌పై ఇంత వివాదం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు కంగనా రనౌత్ సోదరి, మేనేజర్ రంగోలీ. నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్ పోల్స్‌తో పోలుస్తూ సోమవారం వివేక్ చేసిన ఓ ట్వీట్ తీవ్రస్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళా కమిషన్లు, సినీ ప్రముఖులు, నెటిజన్లు వివేక్‌పై ధ్వజమెత్తడంతో ఆయన ఆ ట్వీట్‌ను తొలగించి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై రంగోలీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ మహిళా కమిషన్ ఈ విషయంలో ఓవర్‌గా స్పందించిందని అన్నారు. ‘జాతీయ మహిళా కమిషన్‌లాంటి ఓ ఫ్రాడ్ సంస్థ దేశంలో స్త్రీవాదం చనిపోవడానికి కారణమైంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారు హాయిగా తమ పనులు తాము చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కానీ ఎవరో ఓ చెత్త జోక్ చేసినందుకు మహిళా కమిషన్ ఓవర్‌గా స్పందిస్తోంది. అసలు ఆ జోక్‌ను అంతగా పట్టించుకోవాలా? నా సోదరి కంగన.. ఓ స్టార్ హీరోపై ఫిర్యాదు చేయడానికి వస్తే తనను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ ఘటనను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి సంఘాలు అత్యాచార కేసులను, నిందితులను పట్టించుకోకుండా ఇలాంటి స్టుపిడ్ జోకులపై పోరాడేందుకు మాత్రం ముందుకొస్తాయి. ఆడవారిని ద్వేషించే ఆడవారే అందరి కంటే భయంకరమైన వ్యక్తులు. అలాంటివారిని గుర్తించి ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ మండిపడ్డారు.
జోక్‌లపై ఎందుకు రాద్ధాంతం
Related tags :