సన్‌ఫార్మాలో అవకతవకలు

దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్‌ఫార్మాషేర్లు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో భారీ ఒడిదొడుకులకు లోనైయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన ఈ షేరు ఒక దశలో రూ.465 వద్ద ట్రేడయింది. ఆ తర్వాత మళ్లీ కుంగి నెమ్మదిగా రూ.442 వద్ద ముగిసింది. దాదాపు 3.10కోట్ల షేర్లు చేతులు మారాయి. అనుబంధ సంస్థలకు కొత్త ఆడిట్‌ సంస్థలను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సన్‌ఫార్మా సోమవారం ప్రకటించింది. దీంతోపాటు దేశీయ అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా పెట్టుబడిదారుల నమ్మకం సడలేలా చేసింది. మరోపక్క గత ఆరు ట్రేడింగ్‌సెషన్లలో సన్‌ఫార్మా షేరు దాదాపు 15శాతం విలువ కోల్పోయింది. సన్‌ఫార్మా నిర్వహణకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఒక ప్రజావేగు సెబీకి లేఖరాసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాన్‌బాక్సీ కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఈ మేరకు సెబీ విచారణ చేపట్టిందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి తమకు సెబీ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వీ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com