సోనియా ఆదాయ పన్ను దస్తావేజులు వెదకండి

నేషనల్ హెరాల్డ్ కేసులో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి 2011-12 సంవత్సరంలో సోనియా, రాహుల్‌ ఆదాయపన్ను వివరాలను పునఃపరిశీలన చేసేందుకు సుప్రీంకోర్టు ఐటీశాఖ అధికారులకు అనుమతిని ఇచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌ పన్ను మదింపు వివరాలను పునఃపరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు గతంలో అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అనుమతిని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో కేసులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. సోనియా వేసిన పిటిషన్‌పై తాము వాదనలు విన్న తర్వాతే.. ఈ మేరకు పన్ను వివరాల పునఃపరిశీలనను ఐటీశాఖ చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే సోనియా, రాహుల్‌ తరఫున దాఖలైన పిటిషన్‌పై తాము ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, జనవరి 8న ఈ కేసులో తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో వారి ఆదాయపన్ను వివరాలను మళ్లీ మదింపు చేయాలని కోర్టు ఐటీ శాఖ అధికారులను ఆదేశించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com