11నుంచి శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభమవుతాయి.

అదే రోజు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు.

2019 లోక్‌సభ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో జరిగే  పార్లమెంటు సమావేశాలు ఇవే కావడం గమనార్హం.

ఈ సమావేశాలు ఈ నెల 11 నుంచి జనవరి 8 వరకు జరుగుతాయి.

ఈ నెల 10న రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రాజ్యసభ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను ఈ సమావేశంలో కోరుతారు.

ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com