మూడు గంటల మెసేజ్

బాధలో ఉన్నప్పుడు సీఎంకు ఫోన్‌ చేస్తానని అంటున్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్. ఆ సీఎం ఎవరో కాదు దేవేంద్ర ఫడణవీస్‌. ఇటీవల ముంబయిలో ‘ముంబయి 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫడణవీస్‌తో పాటు షారుక్‌ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫడణవీస్‌తో తనకున్న అనుబంధం గురించి షారుక్‌ వివరించారు. ‘సీఎం సాహబ్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన నాకు ఎంత మంచి స్నేహితుడంటే నేను ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు వెంటనే ఆయనకు ఫోన్‌ చేస్తాను. ఉదయం 3, 4 గంటలైనా కూడా నేను ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాను. నేను ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు నాకు మొదట గుర్తొచ్చేది సీఎం సాహబే. మంచి రోజుల్లో మాత్రం ఆయనకు ఎప్పుడూ ఫోన్‌ చేయను. రాత్రి వేళల్లో నేను ఎవ్వరికీ మెసేజ్‌లు పంపను. నేను మేల్కొని ఉన్నాను కదా అని వాళ్లు కూడా మేల్కొని ఉంటారని అనుకోను. కానీ 3 గంటలకు ఫడణవీస్‌కు నేను మెసేజ్‌ చేసిన రోజులున్నాయి. వాటిలో వ్యక్తిగత, సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలున్నాయి. ఫడణవీస్‌ కూడా నా మెసేజ్‌లకు వెంటనే స్పందిస్తారు. సాయం చేస్తుంటారు’ అంటూ సీఎంతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు షారుక్‌. ప్రస్తుతం షారుక్‌ ‘జీరో’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ కథానాయికలుగా నటించారు. డిసెంబర్21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com