క్యాబిజీ కొంటే రెండు లక్షల డాలర్లు

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళ దుకాణానికి క్యాబేజ్‌ కొనేందుకు వెళ్లి.. భారీ లాటరీ గెలుచుకుంది. మొత్తం 2.25 లక్షల డాలర్ల విలువైన సొమ్మును ఆ మహిళ గెలుచుకోవడం విశేషం. గ్రోవ్‌టన్‌ పట్టణానికి చెందిన వెనెస్సా వార్డ్‌ అనే మహిళకు ఆమె తండ్రి ఫోన్‌ చేసి క్యాబేజ్‌ తీసుకొని రమ్మనడంతో ఆమె స్థానిక జైంట్‌ ఫుడ్‌ స్టోర్‌ అనే దుకాణానికి వెళ్లింది. అక్కడే ఆమె అనుకోకుండా ఓ లాటరీ టికెట్‌ కూడా కొనుగోలు చేసింది. ఇంటికెళ్లాక ఆ టికెట్‌ను స్ర్కాచ్‌ చేయగా.. అందులో 2.25 లక్షల డాలర్లు గెలిచినట్లుగా ఉంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను గెల్చుకున్న సొమ్మును భవిష్యత్తులో పదవీ విరమణ పొందాక ఉపయోగించుకుంటానని, డిస్నీ వరల్డ్‌ చూసేందుకు వెళ్తానని వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com