“అమ్మ”

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ రోజు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లుక్‌లో నిత్యామేనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు. పేపర్‌టేల్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com