చలికాలం నెయ్యి కాపాడుతుంది

నెయ్యితో ఆహారం రుచి పెంచడమే కాదు, అందాన్నీ పెంచుకోవచ్చు. చలికాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు నెయ్యి ఉపయోగపడుతుంది.
*పొడిచర్మం
చలికాలంలో చర్మం తొందరగా పొడిబారుతుంది. కొద్దిగా నెయ్యి తీసుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. నెయ్యి చక్కని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది.
*యవ్వన చర్మం
నెయ్యిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
*బాత్ ఆయిల్
నెయ్యి బాత్ ఆయిల్గానూ పనిచేస్తుంది. అయిదు టేబుల్ స్పూన్ల నెయ్యిలో, కొద్దిగా లావెండర్ లేదా ఆలివ్ నూనె కలిపి, స్నానం చేసే ముందు ఒంటికి పట్టించాలి. దీంతో చర్మం కొత్త నిగారింపు పొందుతుంది.
*అలసిన కళ్లకు
పని ఒత్తిడితో కళ్లు అలిసిపోతాయి. కళ్ల అలసటను పోగొట్టేందుకు నెయ్యిని కళ్ల చుట్టూరా మర్దన చేసినట్టు రాసుకోవాలి. దీంతో కళ్లకు సాంత్వన లభిస్తుంది. కళ్లలోకి నెయ్యి వెళ్లకుండా చూసుకోవాలి.
*పెదాలకు
నెయ్యి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పెదాల మీద కొద్దిగా నెయ్యి రాసుకుంటే, పెదాలు సున్నితంగా, తాజాగా కనిపిస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com