Movies

జోసెఫ్ రీమేక్‌లో రాజశేఖర్

జోసెఫ్ రీమేక్‌లో రాజశేఖర్

కథానాయకుడు రాజశేఖర్‌ రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’ రీమేక్‌లో రాజశేఖర్‌ నటించబోతున్నారు. ఓ విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసి స్క్రిప్టుని సిద్ధం చేశారు. లలిత్‌ అనే ఓ కొత్త కెప్టెన్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణని ప్రారంభించడంతోపాటు, ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. రాజశేఖర్‌ ‘కల్కి’ తర్వాత చేస్తున్న చిత్రమిదే.