పోలీసులు అలా సహకరిస్తున్నారని ఫిర్యాదు

కూకట్‌పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com