లేదని బాధపడద్దు…

దివంగత నటి శ్రీదేవిని కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు నమస్కరించేవాడినని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌. ఇటీవల ఓ రియాల్టీ డ్యాన్స్‌ షోలో శ్రీదేవిని స్మరించుకుంటూ ఎందరో కంటెస్టెంట్స్‌ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ షోకు అనిల్ కపూర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి అనిల్‌ అక్కడివారితో పంచుకున్నారు. ‘మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వచ్చాయి. ఓ ఆర్టిస్ట్‌గా శ్రీదేవితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆమెను కలిసిన ప్రతీసారి పాదాలకు నమస్కరించేవాడిని. కానీ శ్రీదేవికి అది అసౌకర్యంగా అనిపించేది. ఆమెలో కొలవలేనంత ప్రతిభ ఉంది. మా అన్న బోనీ కపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెపై ఉన్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆమె మనతో లేరని బాధపడకూడదు. ఎన్నో సినిమాల్లో నటించి మనల్ని అలరించినందుకు సంతోషించాలి.’ అని వెల్లడించారు అనిల్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు శ్రీదేవి. షారుక్‌ఖాన్‌ నటించిన ‘జీరో’ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో నటించారు. శ్రీదేవి చివరిగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలోని ఇతర స్టార్స్‌తో కలిసి ఓ పాటలోనూ డ్యాన్స్‌ చేశారట. డిసెంబర్‌21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com