భారత ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం

విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బయటి శక్తుల ప్రభావానికి లోనై పని చేశారని ఇటీవల పదవీ విరమణ పొందిన జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కురియన్‌ వ్యాఖ్యల వల్ల సుప్రీంకోర్టుపై ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందని అందువల్ల ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి అసహనం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ఈ పిటిషన్‌ వేసినట్లు సదరు న్యాయవాది తెలిపారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలేంటి ఇది? మీరు మీ పని చేసుకోండి. మేం మా పని చేసుకుంటాం అంతే. వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. న్యాయస్థానాన్ని నిర్వహించే వ్యక్తుల మీద అది ఆధారపడి ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. న్యాయవాది వేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణ జరపాలనే విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. ‘మేం మా పని చేసుకుంటాం. అందరూ అలాగే చేసుకోండి’ అంటూ సీజేఐ సూచించారు. మాజీ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బయటి శక్తుల ప్రభావానికి లోనై పని చేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పండిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. జస్టిస్‌ మిశ్రా బయటి రిమోట్‌ కంట్రోల్‌ ప్రభావానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆయన స్వతంత్రంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com