బ్రిటన్ గోల్డెన్ వీసాల నిలుపుదల

కోట్లకు పడగలెత్తే భారతీయులు సహా ప్రపంచ కుబేరులకిచ్చే ‘బంగారు వీసా’లను బ్రిటన్ ప్రభుత్వం నిలిపివేయనుంది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనే వార్తల నడుమ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఇది అమలులోకి వస్తుంది. టైర్-1 పెట్టుబడిదారుల వీసాను బంగారు వీసా (గోల్డెన్ వీసా)గా పిలుస్తుంటారు. రూ.18.06 కోట్లు (2 మిలియన్ల పౌండ్లు)కుపైగా పెట్టుబడులు పెట్టేవారికి ఈ వీసాలు ఇస్తారు. బ్రిటన్లో శాశ్వత నివాస హక్కులను వేగంగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 2009 నుంచి 76 మంది భారత సంపన్నులు ఈ వీసా పొందారు. .

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com