పిస్తా బాగా తినాలి

పిస్తాపప్పును సరిపడా వేయించి..ఉప్పు చల్లి సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే ఆ రుచే వేరు. ఇవి కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. పిస్తా పప్పులో విటమిన్ బి6 అధికం. ఇది హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి ఇతర అవయవాలకు సరిపడా ప్రాణవాయువుని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి6 రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లకు దూరంగా, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఎదిగే పిల్లలకు ఈ పప్పు చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ గుప్పెడులో సగం పిస్తా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్ ‘ఇ’ అందుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముడతలను దూరం చేస్తుంది. పిస్తాలోని ఇతర పోషకాలు చర్మ క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడతాయి. కంటిచచూపుకు పిస్తా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కెరోటినాయిడ్లూ, లూటిన్ అధికంగా లభిస్తాయి. ఇవి కంటిలోని కణాలను పునరుద్ధరించి చూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి..కొత్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. కంటి సమస్యలతో బాధపడే వారు వీటిని తరచూ తీసుకుంటే మంచిది. వీటిల్లో పీచు సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పప్పు తినడానికి ప్రాధాన్యమిస్తే మంచిది. జీర్ణవ్యవస్థ పనితీరునీ ఇది మెరుగుపరుస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com