DailyDose

నాంపల్లి కోర్టు నిండా కాంగ్రెస్ నాయకులే-నేరవార్తలు

Congress Leaders Flood Nampally Special Court In Various Case Hearings

* నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పలు కేసుల విచారణ# కాంగ్రెస్ నేతలు సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, విజయ రమణారావుపై కేసు కొట్టివేసిన కోర్టు* ఎమ్మెల్యే హరిప్రియపై కూడా కేసు కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు* రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు అడ్డుకున్నారన్న కేసులో కోర్టు తీర్పు* వేర్వేరు కేసుల్లో రాజా సింగ్, జలగం వెంకట్రావు, రాములు నాయక్, నాగం జనార్దన్ రెడ్డి. డీకే భరత్ సింహా రెడ్డి హాజరు

* సీబీఐ కోర్టు ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 9కి వాయిదా.* ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐకి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.* ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై ఈనెల 9లోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం.* జగన్ ఆస్తుల కేసులో పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ పై కొనసాగిన వాదనలు.

* గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోకి వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

* కృష్ణా జిల్లా, మచిలీపట్నం …పొలాల్లోకి దూసుకుపోయిన కారు …ఏ.పి 39A T 0189 హున్దాయ్ కారు అదుపుతప్పి మచిలీపట్టణం-విజయవాడ ప్రధాన రహదారిపై నుండి ప్రక్కనే ఉన్న సోడా దుకాణం ఢికొని పొలాల్లోకి దూసుకుపోయింది …రోడ్డు పక్కనే ఉన్న మార్కింగ్ రాయను సైతం కారు వేగం పెకిలించింది ….కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు …నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు ఘటభాస్థలంను బట్టి తెలుస్తుంది …కారు వెనుక అద్దంపైన లాయర్ స్టికర్ అంటించి ఉంది …

* రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయానికి ప్రతి జిల్లాలోనూ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో వారానికోసారి ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.తలెత్తుకునే జీవించేలా ఎస్సీ, ఎస్టీలకు హక్కులు క్పలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

* విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పలు అనుమానాలకు తావిస్తున్న ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా ముకం గ్రామానికి చెందిన అమర్ ప్రసాద్ అనే 21 సంవత్సరాల యువకుడు రెండు రోజులుగా ఫిషింగ్ హార్బర్ లో గల ఓ పాడుబడిన బస్ స్టాప్ లో ఉరేసుకుని వేలాడుతున్న సంఘటన గురువారం ఉదయం బయటపడింది.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు

* ఉరేసుకుని తల్లీ బిడ్డలు ఆత్మహత్య.కడప నగరంలోని శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్‌ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది. శివకుమార్‌ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.శ్రావణి… కుమార్తె తన్విక(8)తో కలిసి శంకరాపురంలోనే నివాసం ఉంటోంది. అయితే, గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.విషయం తెలుసుకున్న చిన్నచౌక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.