గర్భవతుల్లారా….దయచేసి వాటిని వాడకండి

అమ్మ కడుపులో ఉన్నప్పుడే సబ్బులు, పేస్టులు సహా సౌందర్య లేపనాల్లోని రసాయనాల బారినపడే బాలికలు త్వరగా యవ్వన దశకు చేరుకుంటారని తాజా అధ్యయనంలో తేలింది. బాలికల హార్మోన్లను డీఇథైల్ సాలేట్, ట్రైక్లోసాన్ లాంటి రసాయనాలు ప్రభావితం చేస్తున్నాయని బయటపడింది. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి యవ్వన దశ వచ్చేవరకు సేకరించిన 338 మంది పిల్లల సమాచారాన్ని వారు విశ్లేషించారు. కిటక నాశనులతోపాటు సౌందర్య లేపన రసాయనాలు వారిపై చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. దీంతో డీఇథైల్ సాలేట్, ట్రైక్లోసాన్ స్థాయిలు ఎక్కువగా ఉండే గర్భిణులకు జన్మించే బాలికలు కొంచెం త్వరగా యవ్వన దశకు చేరుకుంటున్నట్లు వెల్లడైంది. కొన్ని సువాసనలు వెదజల్లే సెంట్లు, సౌందర్య లేపనాల్లో డీఇథైల్ సాలేట్ కనిపిస్తుంటుంది. బ్యాక్టీరియాలను నిరోధించేందుకు సబ్బులు, పేస్టులు, సౌందర్య లేపనాల్లో ట్రైక్లోసాన్ను ఉపయోగిస్తుంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com