ఇన్సులిన్ లభ్యత ఉండకపోవచ్చు

పేలవమైన జీవన విధానం, ఊబకాయం, ఇతర అంశాల కారణంగా టైప్‌ 2 మధుమేహ సమస్య ప్రపంచవ్యాప్తంగా బాగా ఎక్కువైంది. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు అవసరమైనంత ఇన్సులిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే మధుమేహం సమస్య తలెత్తుతుంది.వచ్చే దశాబ్దంలో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహ బాధితులకు ఇన్సులిన్ ధరపరంగా, లభ్యతపరంగా అందుబాటులో ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో సుమారు 40 కోట్ల మందికి టైప్‌ 2 మధుమేహ సమస్య ఉంది. వీరిలో సగం మందికి పైగా చైనా, భారత్, అమెరికాల్లోనే ఉన్నారు.మధుమేహ బాధితుల్లో ఎక్కువ మందికి టైప్ 2 సమస్యే ఉంది. ఇప్పుడు 40 కోట్లుగా ఉన్న టైప్ 2 బాధితుల సంఖ్య 2030లోగా 50 కోట్లు దాటుతుందని అంచనాలు చెబుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com