70512 శ్రీవారి సేవా టికెట్లు విడుదల

1. ఆన్ లైన్ లో 70,512 శ్రీవారి సేవా టికెట్లు విడుదల- తదితర ఆద్యాత్మిక వార్తలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి మాసం కోటా కింద 70,512 టికెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్ డిప్ విధానం కింద 11,537 సేవా టికెట్లు విడుదల చేయగా.. వీటిలో సుప్రభాతం 8,182, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు చొప్పున ఉన్నాయి. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,975 టికెట్లు విడుదల చేశారు. వీటిలో విశేషపూజ 2 వేలు, కల్యాణోత్సవం 14,725, ఊంజలసేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 వంతున అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ డిప్ కింద ఈ నెల 11న మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ తీస్తారు. టికెట్లు లభించిన భక్తులు ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
2. తత్ప్రణమామి సదాశివలింగం – తదితర ఆద్యాత్మిక వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర తీరంలో శ్రీ మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటీ ఎనిమిది లక్షల శివలింగాలను భక్తులు అభిషేకించారు.
3. తిరుమలలో అధ్యయనోత్సవాల ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహిస్తారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబరు 31వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
4. అద్భుతం… శ్రీశైవక్షేత్రం -ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి వ్యాఖ్య
పవిత్ర కృష్ణానదీ తీరాన ఉన్న శ్రీశైవక్షేత్రం అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రశంసించారు. రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న శ్రీశైవక్షేత్రాన్ని ఆమె తన మనవడు దేవాన్ష్తో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీలు భువనేశ్వరికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీకోటిలింగేశ్వరస్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. శ్రీప్రత్యంగిర అమ్మవారికి క్షేత్రపీఠాధిపతి శివస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుళ్ళూరు జడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, కే.హేమసుందర్ తదితరులు ఆమె వెంట ఉన్నారు.
5. అప్పన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.ఎన్.రాధాకృష్ణన్ దంపతులు శుక్రవారం విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి దంపతులు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణ చేశారు.
6. కనకదుర్గ సేవలో జస్టిస్ బాలయోగి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.బాలయోగి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
7. రాముడి రూపం.. కల్పవృక్ష తేజసం
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ జరిగింది. అహల్యకు శాప విమోచనం ఇచ్చిన శ్రీరామచంద్రుడు రూపాన్ని ధరించిన అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి హనుమంత వాహనసేవ జరిగింది. శనివారం ఉదయం పల్లకీ సేవ, రాత్రి గజవాహన సేవలు నిర్వహిస్తారు. గజ వాహనసేవలో అమ్మవారికి శ్రీవారి శ్రీలక్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు. శనివారం ఉదయం తిరుమల నుంచి శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తితిదే ఉన్నతాధికారులు ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకురానున్నారు.
8. ఆన్లైన్లో 70,512 శ్రీవారి సేవా టికెట్లు -మార్చి కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి కోటా కింద 70,512 టికెట్లను తితిదే శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్ డిప్ విధానం కింద 11,537 సేవా టికెట్లు విడుదల చేయగా.. వీటిలో సుప్రభాతం 8,182, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2,875 టికెట్లు చొప్పున ఉన్నాయి. ఆన్లైన్ జనరల్ కేటగిరిలో 58,975 టికెట్లు విడుదల చేశారు. వీటిలో విశేషపూజ 2 వేలు, కల్యాణోత్సవం 14,725, ఊంజలసేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,300, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 వంతున అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ డిప్ కింద ఈ నెల 11న మధ్యాహ్నం 12వరకు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ తీస్తారు. టికెట్లు లభించిన భక్తులు ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. శ్రీవారి ఆలయంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహిస్తారు. డిసెంబరు 31వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
9. అధ్యయనోత్సవాలకు భద్రగిరి ముస్తాబు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నుంచి జరిగే వైౖకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రగిరి ముస్తాబైంది. శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానుండగా ఈనెల 28 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం నుంచి ఈనెల 17 వరకు పగల్పత్తు ఉత్సవాలు, 18 నుంచి 28 వరకు రాపత్తు ఉత్సవాలు, 29 నుంచి 31 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 2న సకల దేవతా అలంకారం. (విశ్వరూపసేవ) నిర్వ హించనున్నారు.
10. శబరిమలపై కేరళ అప్పీలు సత్వర విచారణకు సుప్రీం ‘నో’
శబరిమల ఆలయానికి సంబంధించి కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం సత్వర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలును రెగ్యులర్ కోర్టు విచారిస్తుందని సీజే రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ఆ గుడి వద్ద భద్రత, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేరళ హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించడాన్ని ప్రభుత్వం సవాలు చేసింది.
11. వైభవంగా శ్రీవారి కాసుల హారం ఊరేగింపు
తిరుమలలో శ్రీవారి కాసుల హారం ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే గజవాహన సేవలో వేంకటేశ్వర స్వామి వారి కాసులహారాన్ని అలంకరించడం ఆనవాయితీ. తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం… హారాన్ని తిరుమల నుంచి తిరుచానూరుకు తరలించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం పద్మావతి దేవేరికి గజవాహన సేవను నిర్వహిస్తారు. అమ్మవారి గజవాహన సేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
12. ఈరోజు పంచాంగం
డిసెంబర్ 8, 2018
శనివారం( స్థిరవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి:పాడ్యమి మ12.57 తదుపరి విదియ
నక్షత్రం : మూల పూర్తి
యోగం : శూలం రా9.20 తదుపరి గండం
కరణం :బవ మ12.57 తదుపరి బాలువ రా1.35
వర్జ్యం : మ2.32 – 4.14 & రా.తె5.52నుండి
దుర్ముహూర్తం :ఉ6.22 – 7.50
అమృతకాలం :రా12.46 – 2.28
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండం:మ1.30 – 3.00
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 6.22
సూర్యాస్తమయం : 5.22

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com