గన్నమనేని రాజేశ్వర్‌పై అక్రమార్జన కేసు

https://www.sec.gov/litigation/complaints/2018/comp-pr2018-273.pdf
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ముగ్గురు భారతీయులపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సింగపూర్ శాఖలో పనిచేస్తూ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి అక్రమంగా బయటికి అందించినట్లు గుర్తించారు. కీలక, రహస్య సమాచారాన్ని గన్నమనేని రాజేశ్వర్(36), భారత్లో ఉంటున్న తన భార్య గండ్ర దీప్తి(33), తండ్రి గన్నమనేని లింగారావు(68)లకు అందజేసినట్లు సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజి కమిషన్(ఎస్ఈసీ) ఓ ప్రకటనలో తెలిపింది. సదరు ట్రేడింగ్కు సంబంధించి మూడు బ్రోకరేజి ఖాతాలను, ఒక అమెరికా బ్యాంకు ఖాతాను జప్తు చేసేందుకు ఎస్ఈసీ కోర్టు ఆదేశాలను పొందింది. ఎస్ఈసీ ఫిర్యాదు ప్రకారం.. 2013 డిసెంబర్ నుంచి 2016 ఆగస్టు మధ్య రాజేశ్వర్ తాను సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి తన పదవిని దుర్వినియోగం చేస్తూ సునిశితమైన, అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని సంగ్రహించినట్లు ఆరోపించింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 40 దాకా మెర్జర్లు, అక్విజిషన్లు, టెండర్లు, కీలకమైన కార్పొరేట్ అంశాలకు సంబంధించిన సమాచారం అందులో ఉన్నట్లు పేర్కొంది. సదరు సమాచారం ఆధారంగా ట్రేడింగ్కు పాల్పడి, తండ్రి, భార్యకు అందించడంతో వారు కూడా అక్రమ ట్రేడింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. ఇలాంటి ట్రేడింగ్ల ఫలితంగా.. సుమారు రూ.4.24 కోట్లదాకా లాభాలు ఆర్జించినట్లు తేల్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com