WorldWonders

విజయనగరం ఉపాధ్యాయుడికి ఘన సత్కారం

విజయనగరం ఉపాధ్యాయుడికి ఘన సత్కారం

ఉపాధ్యాయులకు బదిలీలు సహజమే. అలా బదిలీ అయిన ఓ టీచర్‌ను ఆ ఊరంతా కదిలి వచ్చి భుజాలపై మోసి.. ఊరేగించి సాగనంపింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విజయనగరం జిల్లా మారుమూల గిరిజన గ్రామమైన మల్లుగూడలో ప్రభుత్వ పాఠశాలలో పదేళ్లుగా పనిచేస్తున్న గౌడు నరేంద్రకు ఈ మధ్యనే బదిలీ అయింది.

స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకున్నా.. చెట్ల నీడలోనే విద్యాబోధన చేసిన నరేంద్ర.. ఆ గిరిజన ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు.

పదేళ్లలో ఏనాడూ తన బాధ్యతపట్ల అలసత్వం ప్రదర్శించలేదు. క్రమశిక్షణతో పాఠాలు చెప్పేవారు.

వేరే స్కూల్‌కు బదిలీ అయిన నరేంద్రకు గ్రామస్తులంతా ఘనంగా వీడ్కోలు పలికారు.

కాళ్లు కడికి పూజలు చేశారు. భుజాలపై ఎక్కించుకుని ఊరేగించారు.

డప్పు చప్పుళ్లతో గిరిజన నృత్యాలతో వీడ్కోలు చెప్పి అభిమానాన్ని చాటుకున్నారు.