కాశ్మీర్ కుర్రాడి గూగ్లీకి వార్న్ ప్రశంసలు

జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌ బల్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల కుర్రాడి ప్రతిభకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ అబ్బురపడ్డాడు. అతడి ప్రశంసలతో ఆ బుడతడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఆ బుడ్డోడి పేరు అహ్మద్. గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో ఆ పిల్లాడు స్పిన్‌ బౌలింగ్‌లో చూపిన ప్రతిభకు వార్న్‌ ముచ్చటపడ్డాడు. వెంటనే ట్విటర్‌లో అతడిని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘ఇది అసాధారణమైంది! చాలా బాగా బౌలింగ్ చేశావ్ యంగ్ మ్యాన్‌’ అని ట్వీట్ చేశాడు. ఆ బాలుడు ఆడుతున్న వీడియోను కశ్మీర్‌లోని ఓ పాత్రికేయుడు ఆన్‌లైన్‌లో షేర్‌ చేయడంతో అహ్మద్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ‘ఇది ఈ శతాబ్దపు బాల్‌గా మారనుంది. మంచి గూగ్లీ వేశాడు. షేన్‌వార్న్‌ ఒకసారి ఇటు చూడండి. మీకు పోటీ ఎదురవుతుంది’ అని ఆ పాత్రికేయుడు అహ్మద్ గురించి పొగిడేశాడు. దానికి వార్న్‌ స్పందించిన అనంతరం అహ్మద్ వివరాలు వెల్లడించాడు. ‘ఆ బాలుడి పేరు అహ్మద్. ఈ ఏడేళ్ల బాలుడిది కశ్మీర్‌లోని గాందర్‌బల్ ప్రాంతం’ అని ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఆ పిల్లాడి వీడియోను 64,000 మంది వీక్షించారు. అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సందర్భంగా మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా 50వేల మంది వీక్షించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com