మధిర ఓటర్ల చైతన్యానికి వందనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 91.27 శాతం ఓటింగ్‌తో రాష్ట్రంలోనే టాప్‌ స్పాట్‌లో నిలిచిన మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది… గత ఎన్నికల్లో ఈ స్థానంలో 89.88 శాతం ఓటింగ్ నమోదు కాగా… ఈ సారి మరింత పెరిగి 91.27గా నమోదైంది. అయితే ఓటర్లు ఎటు మొగ్గు చూపారు? భారీ పోలింగ్ ఎవరికి లాభం? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. మరోవైపు గెలుపుపై ఇటు కాంగ్రెస్… అటు టీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి… తెలుగుదేశం ఓట్లన్నీ పక్కాగా తమకే పడ్డాయని… విజయం నల్లేరుపై నడకే అని కాంగ్రెస్ నేతలు భావిస్తుండగా… ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వల్లే ఓటింగ్ శాతం పెరగింది… మధిర తమదే నంటూ టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక మధిర అసెంబ్లీ ఎన్నికను సవాల్ గా తీసుకున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… అక్కడే తిష్టవేసే ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎర్రుపాలెం మండలం ఓట్లు తమకే అంటూ లెక్కలు వేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.03,132 ఓట్లు ఉండగా… 91.27 శాతం పోలింగ్ నమోదైంది… హైదరాబాద్‌తో పాటు ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఓట్లు వేశారు యువత. మరి ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క… మళ్లీ తన విజయంపై ధీమాగా ఉండగా… కారు జోరుమీదుంది… మధిరలో జెండా ఎగురవేస్తామంటోంది టీఆర్ఎస్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com