భారత మహిళలను నడిపిస్తా

భారత మహిళల జట్టు కోచ్‌ పదవీ కోసం వారం క్రితం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్‌ గిబ్స్‌ సైతం ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నాడు. అంతర్జాతీయ జట్లకు కోచ్‌గా పనిచేసిన డావ్‌ వాట్‌మోర్‌, వెంకటేశ్‌‌ ప్రసాద్‌, టామ్‌ మూడీ వంటి అనుభవజ్ఞులతో పోటీ పడి తన ఆదృష్టం పరీక్షించుకోనున్నాడు. గిబ్స్‌ దక్షిణాఫ్రికా తరఫున 90 టెస్టులు, 248 వన్టేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఇటీవల కువైట్‌ జట్టు కోచ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియాలో 2020లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు కువైట్ జట్టు అర్హత సాధించడానికి కృషి చేస్తున్నాడు. ఈ మధ్యే ముగిసిన అఫ్గానిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్)లో బాఖ్ లెజెండ్స్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ‘భారత మహిళల జట్టుకు కోచ్‌గా పనిచేయాలని గిబ్స్‌ ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. టీమిండియా జాతీయ జట్టుతో కలిసి పనిచేయడం ఎంతో ప్రతిష్ఠాత్మక విషయం. కోచ్‌ పదవి కోసం గిబ్స్‌ దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూ కోసం బీసీసీఐ ఆహ్వానిస్తుందని నమ్మకంగా ఉన్నాడు’ అని హర్షల్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com