స్కోడా కార్లు మరింత ప్రియం

స్కోడా కార్ల ధరలు జనవరి నుంచి దాదాపు 2శాతం వరకు పెరగనున్నాయి. ఈ విషయాన్ని స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. ముడివస్తువుల ధరలు పెరగటంతో కార్ల ధరలను కూడా పెంచాల్సి వచ్చిందని స్కోడా ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో పలు సంస్థలు తమ కార్ల ధరలను పెంచాయి. ధరలు పెంచిన వాటిలో మారుతీ సుజుకీ, హుండాయి, బీఎండబ్ల్యూ వంటివి ఉన్నాయి. ‘‘ముడి సరుకుల ధరలు పెరగటం, ధరల్లో తరచూ భారీ వ్యత్యాసాలు చోటు చేసుకోవడం, ఫారెన్‌ ఎక్స్‌ఛేంజి ధరల్లో మార్పులను ఇప్పటి వరకు భరించాము. కానీ ఇప్పుడు 2శాతం వరకు ధరలు పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.’’ అని అమ్మకాలు, సర్వీస్‌ విభాగం డైరెక్టర్‌ జక్‌ హాలిస్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com