శాన్ఆంటోనియోలో విజయవంతంగా తానా సీపీఆర్


ఆపత్కర పరిస్థితుల్లో ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టే సీపీఅర్ పద్ధతిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) శాన్ఆంటోనియో ప్రతినిధులు స్థానికంగా ఉన్న 200మంది ప్రవాసులకు శిక్షణనిచ్చారు. డా.గొట్టిముక్కల అనుపమ, డా.బీరం శ్రీధర్‌లు ఔత్సాహికులకు తర్ఫీదునిచ్చారు. సీపీఆర్ వంటి సునాయాస పద్ధతి పట్ల అవగాహన పెంపొందించుకోవడం వలన ప్రాణాలను నిలబెట్టే అవకాశాలను మెరుగుపరచవచ్చునని తానా ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం అయిందని తానా కార్యక్రమ నిర్వాహక విభాగ చైర్మన్ సూరపనేని రాజా తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి వుయ్యూరు శ్రీలక్ష్మీ, అట్లూరి ఫణి, అట్లూరి అనూ, డా. చెరుకు కిరణ్, చండ్ర దిలీప్ కుమార్, అమరనేని సుధాకర్, గింజుపల్లి గౌతం, శాన్ఆంటోనియో షిర్డీ సాయిబాబ ఆలయ కార్యకర్తలు, భారత సంతతి అమెరికన్ వైద్యుల సంఘ సభ్యులు తోడ్పడ్డారు. ప్రవాసులకు ఉపయుక్తమైన ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన శాన్ఆంటోనియో తానా ప్రతినిధులను తానా అధ్యక్షుడు వేమన సతీష్, తానా ఫౌండేషన్ చైర్మన్ డా.నల్లూరి ప్రసాద్, మాజీ అధ్యక్షులు కోమటి జయరాం తదితరులు అభినందించారు.










More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com