కర్మఫలం నిజమేనా?

మానవుడు కోరుకొనే ఆనందము అంతులేనిది, అపరిమితమైనది, నిత్యమైనది. మరి చేసే కర్మలేమో అంతంతో కూడినవి, పరిమితమైనవి, అనిత్యమైనవి. పరిమిత కర్మల ద్వారా అపరిమిత ఆనందము రాదు. అనిత్యమైన పనుల ద్వారా నిత్యమైన ఆనందము కలగదు. అనంతమైన ఆనందం కావాలంటే అనంతమైన కర్మయే చెయ్యాలి. మరి మనం చేసే కర్మలన్నీ కాలంలోనే ప్రారంభమై కాలంలోనే అంతమవుతాయి గాని అనంతం కావటానికి వీలులేదు. కనుకనే కర్మలు మనిషిని అనంతునిగా శాశ్వతానంద స్వరూపునిగ ఎన్నటికీ మార్చలేవు. కర్మలవల్ల ఏం జరుగుతుంది?-
మనం చేసే కర్మల వల్ల మనకు కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాలను పొందటం వల్ల అవి మనలో కొన్ని వాసనలను మిగులుస్తాయి. ఆ వాసనలు మనలను మళ్ళీ అలాంటి కర్మలకు పురిగొల్పుతాయి. ఇలా కర్మలు విధిగా చేయవలసిన స్ధితి ఏర్పడుతుంది. మనం ఒక పుణ్యక్షేత్రానికి యాత్ర చేసివచ్చాం. అక్కడ ఎంతో ఆనందాన్నిపొందాం. ఆ అనుభూతి మనలో వాసనగా మారి అలాంటి ఆనందానుభూతిని మళ్ళీ పొందాలని ప్రేరేపిస్తుంది. అలాగే మనం పూజచేశాం లేదా శాస్త్రశ్రవణం చేస్తున్నాం. దీనివల్ల మనలో కొంత ఆనందం కలిగిందనుకోండి. ఆ ఆనందానుభూతి వాసనగా మారి మరల మరల మనను ఆ పనికి పురికొల్పుతుంది. ఇవి సద్వాసనలు. అలాగే కొన్ని దుర్వాసనలుంటాయి. పేకాటో, త్రాగుడో, జూదమో ఆడి ఆనందాన్ని పొందామనుకోండి అది మనలో వాసనగామారి, వ్యసనంగా మళ్ళీ మళ్ళీ ఆటకు మనస్సు ప్రేరేపిస్తుంది. కనుక దీనికి అంతులేదు. ఇలా కర్మలు మనను కర్మ సముద్రంలో ముంచివేస్తాయి. అందుకే ఉపదేశసారమనే గ్రంధంలో భగవాన్ రమణ మహర్షుల వారు రెండవ శ్లోకంలో ఇలా చెప్పారు.
కృతి మహోదధౌ పతనకారణం |
ఫల మశాశ్వతం గతి నిరోధకం||
కర్మల యొక్క ఫలం అశాశ్వతమని, అవి మనను కర్మ సముద్రంలో పడవేస్తాయని, పైగా అవి ఉత్తమగతిని చేరటానికి అవరోధమౌతాయని తెలియజేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com